అస్సాం.. క్వారంటైన్ గదుల్లో ఉన్న కరోనా బాధితులు ఏం చేస్తున్నారంటే ?

| Edited By: Anil kumar poka

Apr 04, 2020 | 12:10 PM

అస్సాం గోలాఘాట్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులు వార్డు అంతా ఉమ్మేస్తున్నారట.. కిటికీల ద్వారా వాళ్ళు ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అస్సాం.. క్వారంటైన్ గదుల్లో ఉన్న కరోనా బాధితులు ఏం చేస్తున్నారంటే ?
Follow us on

అస్సాం గోలాఘాట్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులు వార్డు అంతా ఉమ్మేస్తున్నారట.. కిటికీల ద్వారా వాళ్ళు ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత్ బిశ్వ శర్మ ఈ హాస్పిటల్ ని సందర్శించడానికి వచ్ఛే ముందే వాళ్ళిలా పాడు పని చేశారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. 42 మందిని క్వారంటైన్ కి తరలించగా.. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో జరిగిన మత పరమైన కార్యక్రమానికి వెళ్లి వఛ్చినవారేనని తెలిసింది. కిటీకీల ద్వారా వీళ్ళు బయటకి స్పీట్ చేస్తుండడంతో ఆస్పత్రి సిబ్బంది బయట గోడలెక్కి ఆ కిటికీలను మూసి వేయవలసి వచ్చింది. తబ్లీఘీ జమాత్ సభ్యుల్లో ఎనిమిదిమందికి కరోనా సోకినట్టు తెలిసింది. తమ ఆరోగ్యం బాగానే ఉందని, నిలకడగా ఉందని వీరంతా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే వీరిని బలవంతంగా తరలించాం అని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.