రాజస్తాన్..అశోక్ గెహ్లాట్ సోదరుని ఆస్తులపై ఈడీ దాడులు

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2020 | 12:30 PM

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అగ్రసేన్ నిర్వహిస్తున్న ఎరువుల కంపెనీ..సబ్సిడీతో కూడిన 'మ్యురియేట్ ఆఫ్ పొటాష్ ' (ఎంఓపీ) అనే ఎరువును ఎగుమతి చేసిందని,  ఇది నిషిధ్ద ఫర్టిలైజర్..

రాజస్తాన్..అశోక్ గెహ్లాట్ సోదరుని ఆస్తులపై ఈడీ దాడులు
Ashok Gehlot
Follow us on

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అగ్రసేన్ నిర్వహిస్తున్న ఎరువుల కంపెనీ..సబ్సిడీతో కూడిన ‘మ్యురియేట్ ఆఫ్ పొటాష్ ‘ (ఎంఓపీ) అనే ఎరువును ఎగుమతి చేసిందని,  ఇది నిషిధ్ద ఫర్టిలైజర్ అని ఈడీ అధికారులు తెలిపారు. దీన్ని ఎగుమతి చేయడానికి అధీకృత డీలర్ అయిన ‘ఇండియన్ పోటాష్’ అనే కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. ఈ ఎరువును సబ్సిడీ రేట్లతో రైతులకు అందజేయాల్సి ఉండగా.. అగ్రసేన్ ఆధ్వర్యంలోని ‘అనుపమ్ కృషి’ అనే కంపెనీ దీన్ని ఇండియన్ పోటాష్ సంస్థ నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకుండా కొందరు వ్యక్తులకు అమ్మివేసేదని తెలిసింది. వారు దీన్ని ‘ఇండియన్ సాల్ట్’ అనే పేరిట మలేసియా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేసేవారట. 2012-13 సంవత్సరాల్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఈ స్కామ్ ని కనుగొన్నారు.

అసలే సచిన్ పైలట్ రూపంలో తన ప్రభుత్వానికి గండం ఎదుర్కొంటున్న సీఎం అశోక్ గెహ్లాట్ కి తన సోదరుని నిర్వాకం మరింత తలనొప్పులు తెచ్చిపెడుతోంది.