లాంచ్ పాడ్స్ వద్ద పొంచి ఉన్న 300 మంది ఉగ్రవాదులు.. ఆర్మీ ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2020 | 5:41 PM

జమ్మూ కాశ్మీర్ లో చొరబడేందుకు సరిహద్దుల పొడవునా లాంచ్ పాడ్స్ వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని ఆర్మీ తెలిపింది. వారితో అవి నిండిపోయాయని, ఏ క్షణంలోనైనా వారు దొంగచాటుగా జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించవచ్చునని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ తెలిపారు. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్ లో శనివారం ఉదయం ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టు బెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ ఉగ్రవాదుల కదలికలపై నిరంతరం […]

లాంచ్ పాడ్స్ వద్ద పొంచి ఉన్న 300 మంది ఉగ్రవాదులు.. ఆర్మీ ప్రకటన
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో చొరబడేందుకు సరిహద్దుల పొడవునా లాంచ్ పాడ్స్ వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని ఆర్మీ తెలిపింది. వారితో అవి నిండిపోయాయని, ఏ క్షణంలోనైనా వారు దొంగచాటుగా జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించవచ్చునని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ తెలిపారు. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్ లో శనివారం ఉదయం ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టు బెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ ఉగ్రవాదుల కదలికలపై నిరంతరం నిఘా ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని పాక్ పోస్టులో  వారి ఉనికి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిందని, అయితే వారి చొరబాటు యత్నాలను దీటుగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. కాగా… ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో.. 1.5 లక్షల భారత-పాకిస్థానీ కరెన్సీని, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. భారత కరెన్సీ కూడా వీరి వద్ద ఉందంటే కాశ్మీర్ లోయలో స్థానికులెవరైనా వీరికి సహకరించి ఉండవచ్ఛునని భావిస్తున్నామన్నారు.