చైనా బోర్డర్ లో ఇక నిరంతర ‘డ్రోన్’ నిఘా

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2020 | 12:02 PM

భారత-చైనా మధ్య బోర్డర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత రక్షణ, పరిశోధన అభివృధ్ది సంస్థ (డీ ఆర్డీఓ) అత్యంత ఆధునికమైన 'భారత్' అనే డ్రోన్ ని రూపొందించింది. దీన్ని భారత సైన్యానికి అప్పగించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతాల్లో..

చైనా బోర్డర్ లో ఇక నిరంతర డ్రోన్ నిఘా
Follow us on

భారత-చైనా మధ్య బోర్డర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత రక్షణ, పరిశోధన అభివృధ్ది సంస్థ (డీ ఆర్డీఓ) అత్యంత ఆధునికమైన ‘భారత్’ అనే డ్రోన్ ని రూపొందించింది. దీన్ని భారత సైన్యానికి అప్పగించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతాల్లో సరిహద్దు నియంత్రణ రేఖ పొడవునా ఎత్తయిన ప్రదేశాల్లో నిఘా పెట్టేందుకు ఈ డ్రోన్ ని ఉపయోగిస్తారని సైనిక వర్గాలు తెలిపాయి. అత్యంత శీతల పరిస్థితుల్లో కూడా పని చేయగల ఈ సాధనం అతి తేలికైనది. ఈ పవర్ ఫుల్ డ్రోన్ మన రక్షణ వర్గాలకు ఎంతో తోడ్పడుతుందని, మిత్రులను, శత్రువులను కూడా కనిపెట్టగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇందులో ఉందని డీ ఆర్ డీ ఓ అధికారులు తెలిపారు. తన మిషన్ సమయంలో ఇది రియల్ టైం వీడియో ట్రాంస్ మిషన్లను అందజేయగలదని వారు చెప్పారు. దీని ఉనికిని రాడార్ సైతం కనిపెట్టజాలదని వారు పేర్కొన్నారు.