భారత్-చైనా కయ్యం….ప్రధాని మోదీతో నరవాణే భేటీ ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 25, 2020 | 5:33 PM

ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణే ప్రధాని మోదీతో సమావేశమై లదాఖ్ లోని తాజా పరిస్థితిపై ఆయనతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద రెండు రోజులపాటు పర్యటించిన ఆయన....

భారత్-చైనా కయ్యం....ప్రధాని మోదీతో నరవాణే భేటీ ?
Follow us on

ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణే ప్రధాని మోదీతో సమావేశమై లదాఖ్ లోని తాజా పరిస్థితిపై ఆయనతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద రెండు రోజులపాటు పర్యటించిన ఆయన.. ముఖ్యంగా గాల్వన్ లోయలోని పరిస్థితి గురించి వివరించవచ్చునని భావిస్తున్నారు. లదాఖ్ తో బాటు లేహ్ లో ఉన్నత సైనికాధికారులతో తాను  జరిపిన చర్చల సారాంశాన్ని నరవాణే తెలియజేయవచ్ఛు. ఈ నెల 6 న చైనా సైనికాధికారులతో చర్చలు జరిపిన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ తో కూడా నరవాణే భేటీ అయిన సంగతి తెలిసిందే.  ఈ నెల ఆరో తేదీతో బాటు 17 న, 22 న కూడా భారత-చైనా దేశాల దౌత్యాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారాను, ఫోన్ లోను చర్చలు జరిపారు. గాల్వన్ వ్యాలీలో చైనా దళాలు కొంత వెనక్కి వెళ్లినట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. మరో వైపున భారత దళాలు ఆ ప్రాంతంలో మరిన్ని మోహరిస్తున్నట్టు  కూడా తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నరవాణే, మోదీ మధ్య జరుగుతుందని భావిస్తున్న సమావేశానికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. చైనా దూకుడు దృష్ట్యా భారత దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేఛ్చనిచ్చింది.