వికాస్ దూబే అనుచరుల్లో మరొకరి అరెస్ట్..

| Edited By: Pardhasaradhi Peri

Jul 25, 2020 | 3:36 PM

ఎన్ కౌంటర్ లో హతుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అనుచరుల్లో యూపీ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. దీంతో దూబే కేసులో అరెస్టయిన వారి సంఖ్య 5 కి చేరింది. 24 ఏళ్ళ శివం దూబే అనే ఇతడిని ఈ నెల 23 న అరెస్టు చేసినట్టు పోలీసులు..

వికాస్ దూబే అనుచరుల్లో మరొకరి అరెస్ట్..
Follow us on

ఎన్ కౌంటర్ లో హతుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అనుచరుల్లో యూపీ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. దీంతో దూబే కేసులో అరెస్టయిన వారి సంఖ్య 5 కి చేరింది. 24 ఏళ్ళ శివం దూబే అనే ఇతడిని ఈ నెల 23 న అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాన్పూర్ లో జరిగిన 8 మంది పోలీసుల ఊచకోత కేసుకు సంబంధించి 21 మందిని నిందితులుగా గుర్తించారు. వివిధ ఎన్ కౌంటర్లలో ఆరుగురు మరణించారని, 5 గురిని అరెస్టు చేయగా..మరో పది మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. భిక్రు గ్రామంలో జులై 2 న జరిగిన ఘటనతో శివం దూబేకి కూడా ప్రమేయం ఉందని వారు పేర్కొన్నారు. ఆ ఘటన జరిగిన అనంతరం ఇతడు పట్టుబడకుండా అనేకచోట్ల దాక్కుంటూ వచ్చాడన్నారు. అయితే   ప్రత్యేక పోలీసు బృందాలకు పట్టుబడక తప్పలేదు.