నాది సామాన్య జీవితం, అనిల్ అంబానీ

| Edited By: Balu

Sep 28, 2020 | 4:15 PM

తనది విలాసవంతమైన జీవితమని లండన్ కోర్టుజడ్జి చేసిన వ్యాఖ్యను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అనిల్ అంబానీ సున్నితంగా తోసిపుచ్చారు. మొదటిసారిగా ముంబై నుంచి వీడియో లింక్ ద్వారా ఆయన కోర్టుకు..

నాది సామాన్య జీవితం, అనిల్ అంబానీ
Follow us on

తనది విలాసవంతమైన జీవితమని లండన్ కోర్టుజడ్జి చేసిన వ్యాఖ్యను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అనిల్ అంబానీ సున్నితంగా తోసిపుచ్చారు. మొదటిసారిగా ముంబై నుంచి వీడియో లింక్ ద్వారా ఆయన కోర్టుకు వాంగ్మూలమిస్తూ, తను సాధారణ జీవితం గడుపుతున్నానని, పూర్తి శాకాహారినని, మద్యం ముట్టనని, అలాగే నాన్-స్మోకర్ నని అన్నారు. తమకు అనిల్ అంబానీ అయిదు వేల కోట్లకు పైగా రుణాలు చెల్లించవలసి ఉందని అంటూ చైనాకు చెందిన కొన్ని బ్యాంకులు ఆయనపై లండన్ కోర్టులో దావా దాఖలు చేశాయి. 2012 లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు తాము రుణాలు ఇచ్చామని, వాటిని సకాలంలో తీర్చేందుకు తనది గ్యారంటీ అని ఆయన హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని ఈ బ్యాంకులు అనారోపించాయి.కానీ ఈ ఆరోపణను ఆయన ఖండించారు.