ఎస్ బ్యాంక్ సంక్షోభం.. ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ

| Edited By: Anil kumar poka

Mar 19, 2020 | 11:38 AM

ఎస్ బ్యాంక్ సంక్షోభం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని కూడా తాకింది. ఈ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్ నిర్వాకం ఫలితంగా ఇది నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

ఎస్ బ్యాంక్ సంక్షోభం.. ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ

ఎస్ బ్యాంక్ సంక్షోభం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని కూడా తాకింది. ఈ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్ నిర్వాకం ఫలితంగా ఇది నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అనిల్ అంబానీ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. నిజానికి ఈ వారారంభంలోనే ఆయన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావలసి ఉన్నప్పటికీ,, తన ఆరోగ్య కారణాల దృష్ట్యా అటెండ్ కాలేకపోయారు. అయితే తాజా సమన్ల మేరకు ఆయన ఇవాళ హాజరై తన వాంగ్మూలాన్ని వినిపించారు. రానాకపూర్ ఎస్ బ్యాంకు సీఈఓగా ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి ఎవరెవరికి, ఏయే కంపెనీలకు రుణాలు ఇచ్చారో.. అనిల్ అంబానీ నుంచి అధికారులు తెలుసుకోనున్నారు. అయితే రానాకపూర్ కుటుంబంతో తమకెలాంటి లింక్ లేదని, ఎస్ బ్యాంకు నుంచి తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు సిధ్ధంగా ఉన్నామని, తమ లావాదేవీలన్నీ పూర్తి నిబంధనల మేరకే జరిగాయని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. ప్రతి ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది.

అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని 9 కంపెనీలు ఎస్ బ్యాంకు నుంచి రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

 

Follow us on