షాన్‌ కానరీని గొప్పగా గౌరవించుకున్న నాసా

|

Nov 03, 2020 | 12:25 PM

జేమ్స్‌బాండ్‌ పాత్రలో ఒదిగిపోయి.. ఆ పాత్రను పాపులర్‌ చేసిన గొప్ప నటుడు షాన్‌ కానరీ.. మొన్న అక్టోబర్‌ 31న 90 ఏళ్ల వయసులో మరణించిన ఆ హాలీవుడ్‌ నటుడికి గొప్పగా నివాళి అర్పించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా..

షాన్‌ కానరీని గొప్పగా గౌరవించుకున్న నాసా
Follow us on

జేమ్స్‌బాండ్‌ పాత్రలో ఒదిగిపోయి.. ఆ పాత్రను పాపులర్‌ చేసిన గొప్ప నటుడు షాన్‌ కానరీ.. మొన్న అక్టోబర్‌ 31న 90 ఏళ్ల వయసులో మరణించిన ఆ హాలీవుడ్‌ నటుడికి గొప్పగా నివాళి అర్పించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా.. ది నేమ్‌ ఆఫ్‌ ది రోజ్‌ అన్న చిత్రంలో ఆయన అపూర్వ నటనకు గుర్తుగా ఒక గ్రహశకలానికి ఆయన పేరును పెట్టింది నాసా. అంగారక, గురు గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు షాన్‌ కానరీ పేరు పెట్టింది నాసా. అన్నట్టు 1979లో షాన్‌ కానరీ మీటియార్‌ అనే చిత్రంలో నటించారు.. మీటియర్‌ అంటే తెలుసుగా ఉల్కాపాతం.. ఓ గ్రహశకలం భూమిని ఢీ కొట్టకుండా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఎలా కాపాడిందన్నదే సినిమా కథాంశం.. అందులో షాన్‌ కానరీ ప్రధాన పాత్ర పోషించారు. ఇంకో విచిత్రమేమిటంటే ఆ సినిమాలో షాన్‌ కానరీది ప్లానెటరీ డిఫెన్స్‌ ఆఫీసర్‌ పాత్ర.. ఇది జరిగిన దశాబ్దాల తర్వాతే నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్‌ ఆఫీసర్‌ను నియమించింది.. ఇప్పుడు షాన్‌ కానరీ పేరు పెట్టుకున్న ఉల్క కూడా చాలా కూల్‌గా ఉంటుందని నాసా అంటోంది.. లెమ్మన్‌ శిఖరంపైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్‌ ద్వారా ఆస్టరాయిడ్ 13070 షాన్‌ కానరీని గుర్తించింది నాసా.. ఏప్రిల్‌ నాలుగున గుర్తించిన ఆ ఆస్టరాయిడ్‌ను ఇటీవల తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది కూడా!