‘రాహుల్ జీ ! ఆ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడో చూడండి’… అమిత్ షా

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 12:33 PM

ఇండో-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వం విపక్షాలను విశ్వాసం లోకి తీసుకోవడంలేదని, చైనాను నియంత్రించలేకపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసీంన ఆరోపణలను హోం మంత్రి అమిత్ షా ఖండించారు. సంకుచిత రాజకీయాలకు పాల్పడవద్దని..

రాహుల్ జీ ! ఆ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడో చూడండి... అమిత్ షా
Follow us on

ఇండో-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వం విపక్షాలను విశ్వాసం లోకి తీసుకోవడంలేదని, చైనాను నియంత్రించలేకపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసీంన ఆరోపణలను హోం మంత్రి అమిత్ షా ఖండించారు. సంకుచిత రాజకీయాలకు పాల్పడవద్దని, ఈ తరుణంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని అంటూ ఆయన.. ఓ వృధ్ధుని వీడియోను ట్వీట్ చేశారు.ఇది క్లియర్ మెసేజ్.. ఇంతకన్నా మీకేం కావాలి అని ఆయన ప్రశ్నించారు. కాగా-ఈ వీడియోలో ఆ వృధ్ధుడు.. భారతీయ సైన్యం చాలా పటిష్టమైనదని, మన సైనికులు చైనానే గాక.. ఇతర దేశాల దళాలను కూడా ఓడించగలరని  అన్నారు. ఇండో-చైనా సైనికుల  ఘర్షణలో గాయపడిన తన కుమారుడు త్వరలో కోలుకుంటాడని ఆశిస్తున్నానని, మళ్ళీ  అతడు పోరాటం చేస్తూనే ఉంటాడని ఆయన పేర్కొన్నాడు.   దయచేసి స్వల్ప కారణాలతో సంకుచిత రాజకీయాలకు పాల్పడడం మానండి అని కూడా అన్నాడాయన.