కరోనా గజగజ.. పార్లమెంట్ ఆవరణలో.. మాస్క్ తో హీరోయిన్ ఎంపీ.. ఎవరామె ?

| Edited By: Anil kumar poka

Mar 04, 2020 | 2:06 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చిన్నా, పెద్దా అందరినీ, సామాన్యులతో బాటు ప్రజాప్రతినిధులను సైతం హడలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టి ఇప్పుడు సుమారు 80 దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి.. రోజురోజుకీ విజృంభిస్తోంది.

కరోనా గజగజ.. పార్లమెంట్ ఆవరణలో.. మాస్క్ తో హీరోయిన్ ఎంపీ.. ఎవరామె ?
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చిన్నా, పెద్దా అందరినీ, సామాన్యులతో బాటు ప్రజాప్రతినిధులను సైతం హడలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టి ఇప్పుడు సుమారు 80 దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి.. రోజురోజుకీ విజృంభిస్తోంది. దీని నివారణకు ఆయా దేశాల ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ.. వివిధ  దేశాల నుంచి వచ్ఛే టూరిస్టుల కారణంగా వ్యాప్తి చెందుతోంది. కాగా ఇండియాలో  తాజాగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంపీల్లో ఆందోళన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..టాలీవుడ్ హీరోయిన్, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా.. బుధవారం పార్లమెంటు ఆవరణలో ముఖానికి మాస్క్ ధరించి ప్రత్యక్షమైంది. రెండో విడత బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న ఈమెను ఇలా చూసి దగ్గరున్న ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే కరోనాపై ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేసేందుకే నవనీత్ కౌర్ ఇలా ముఖానికి మాస్క్ ధరించి వచ్చిందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.
v