బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా 1 న బ్లాక్ డే గా పాటిస్తాం.., ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల సంఘం వెల్లడి, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్

| Edited By: Phani CH

Jun 01, 2021 | 12:05 PM

డాక్టర్లపైనా, అలోపతి మందులపైనా యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 1 వతేదీని బ్లాక్ డేగా పాటిస్తామని ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ల సంఘం ప్రకటించింది.

బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా 1 న బ్లాక్ డే గా పాటిస్తాం.., ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల సంఘం వెల్లడి, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్
Aiims Doctors Protest For Baba Ramdev
Follow us on

డాక్టర్లపైనా, అలోపతి మందులపైనా యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 1 వతేదీని బ్లాక్ డేగా పాటిస్తామని ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్, , వైద్య సిబ్బంది పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్నాయని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఆయన కామెంట్స్ చాలా అవమానకరంగా ఉన్నాయని, పబ్లిక్ హెల్త్ సిస్టం ని పూర్తిగా విఫలం చేసేవిగా ఉన్నాయని ఈ సంఘం సభ్యులు తీవ్రంగా విమర్శించారు. పైగా హెల్త్ కేర్ సర్వీసెస్ సిబ్బందిపై హింస కూడా ప్రబలవచ్చునని, ఆ కామెంట్స్ ను తేలికగా పరిగణించరాదని వారన్నారు. తాము జూన్ 1 న బ్లాక్ డేగా పాటిస్తున్నప్పటికీ రోగుల సేవలకు అంతరాయం వాటిల్లబోదని ఈ సభ్యులు స్పష్టం చేశారు. డాక్టర్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తించకుండా బాబా రాందేవ్ వ్యాఖ్యలు వారిని వేధించే విధంగా కూడా ఉన్నాయని వారు దుయ్యబట్టారు.

కాగా తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని అంటూ బాబా రాందేవ్ ఇటీవల ఓ వీడియో ను రిలీజ్ చేశారు, మోదీ కే బాప్ భీ ముఝే అరెస్ట్ నహీ కర్ సక్తా అని అయన వ్యాఖ్యానించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి, ఈయనకు మధ్య పెను వివాదం నలుగుతోంది. ఐఎంఏ కూడా రాందేవ్ ని అరెస్టు చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Xiaomi Hyper Charge: సరికొత్త టెక్నాలజీతో షియోమి ఫాస్ట్‌ చార్జర్స్‌.. కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌

మయన్మార్ తరహా సైనిక కుట్ర అమెరికాలోనూ జరిగితే మేలు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ వివాదాస్పద వ్యాఖ్య