కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ! డీఎంకె కూడా ఆబ్సెంట్ !

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2020 | 4:38 PM

సీఏఎ ఇతర అంశాలపై వివిధ ప్రతిపక్షాలతో సోమవారం పార్లమెంట్ హౌస్ లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ పార్టీకి మిత్రపక్షమైన డీఎంకే కూడా ఈ సమావేశానికి గైర్హాజరైంది. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ , శివసేన ఇదివరకే తాము రావడంలేదని పేర్కొన్నాయి. తాజాగా డీఎంకె కూడా ఆ పార్టీల బాటనే నడిచింది. తాము ఆబ్సెంట్ కావడానికి ఆ నాలుగు పార్టీలు వివిధ కారణాలను చెప్పగా.. డీఎంకె ఎలాంటి కారణం తెలియజేయలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు […]

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ! డీఎంకె కూడా ఆబ్సెంట్ !
Follow us on

సీఏఎ ఇతర అంశాలపై వివిధ ప్రతిపక్షాలతో సోమవారం పార్లమెంట్ హౌస్ లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ పార్టీకి మిత్రపక్షమైన డీఎంకే కూడా ఈ సమావేశానికి గైర్హాజరైంది. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ , శివసేన ఇదివరకే తాము రావడంలేదని పేర్కొన్నాయి.

తాజాగా డీఎంకె కూడా ఆ పార్టీల బాటనే నడిచింది. తాము ఆబ్సెంట్ కావడానికి ఆ నాలుగు పార్టీలు వివిధ కారణాలను చెప్పగా.. డీఎంకె ఎలాంటి కారణం తెలియజేయలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ కి ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎల్జీడీ చీఫ్ శరద్ యాదవ్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేదికనలంకరించారు. ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. తాము ఈ సమావేశానికి హాజరు కావడంలేదని ఆప్ ఓ వైపు ప్రకటించగా.. ఈ పార్టీ నేత సంజయ్ సింగ్ మాత్రం.. తమకు ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు హాజరై మాత్రం ప్రయోజనం ఏముంటుందని నిట్టూర్చారు. మొత్తం 20 విపక్షాలు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.