మూడు రోజుల విరామం తరువాత గెహ్లాట్, సచిన్ పైలట్ మీట్ !

| Edited By: Anil kumar poka

Aug 13, 2020 | 8:06 AM

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మూడు రోజుల విరామం తరువాత గురువారం ముఖాముఖి కలుసుకోనున్నారు. రాష్ట్ర ఆసెంబ్లీ ప్రత్యేక  సెషన్ రేపటినుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో...

మూడు రోజుల విరామం తరువాత గెహ్లాట్, సచిన్ పైలట్ మీట్ !
Follow us on

రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మూడు రోజుల విరామం తరువాత గురువారం ముఖాముఖి కలుసుకోనున్నారు. రాష్ట్ర ఆసెంబ్లీ ప్రత్యేక  సెషన్ రేపటినుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ సిఎల్ఫీ సమావేశం జరగనుంది. జరిగిందేదో జరిగింది..ఇక మర్చిపోదాం, క్షమించేద్దాం అన్న  అశోక్ గెహ్లాట్..ఇక రెబెల్ వర్గం వారిని క్షమించేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. తిరిగి అంతా కలిసి సంక్షోభ పరిష్కారానికి కృషి జరుపుతారా లేదా అన్నది కూడా  ఈ రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.

సచిన్ పైలట్ ఈ నెల 11 న ఢిల్లీ నుంచి జైపూర్ తిరిగి రాగా.. నిన్న గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలంతా జైసల్మీర్ నుంచి జైపూర్ చేరుకున్నారు. గతంలో ఇక్కడ ఏ హోటల్లో ఉన్నారో అక్కడికే వారిని మళ్ళీ తరలించారు. వారు రేపటివరకు ఇదే హోటల్లో ఉండవచ్చు. అయితే రేపు  శాసన సభలో గెహ్లాట్ బలపరీక్ష జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. తన పట్ల గెహ్లాట్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపట్ల సచిన్ పైలట్ ఆగ్రహంగా ఉన్నారు. మరి నేటి సీఎల్ఫీ సమావేశం ఎలా జరుగుతుందో చూడాల్సి ఉంది.