బ్రేకింగ్..నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ కి కారణం..

బ్రేకింగ్..నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 3:21 PM

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ కి కారణం తెలియలేదు. అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి విదితమే.’ పవిత్ర రిస్తా ‘ టీవీ సీరియల్ తో పాపులర్ అయిన 34 ఏళ్ళ సుశాంత్.. ‘కైపోచే’ మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా ‘డ్రైవ్’ చిత్రంలో నటించాడు. కొన్ని రోజులుగా ఈ నటుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసింది. బాంద్రాలో సుశాంత్  ఒంటరిగా ఉంటున్నాడని, తన యజమాని ఎందుకు సూసైడ్ కి పాల్పడ్డాడో తెలియడం లేదని అతని ఇంటి నౌకరు చెప్పాడు.  ఆ నౌకరు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వఛ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టు అందవలసి ఉంది. కాగా, కెరీర్ ప్రారంభంలో టీవీ షోల్లో చేసిన సుశాంత్‌.. ‘కిస్ దేశ్ మే హే మేరా దిల్’ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు.

సుశాంత్ నటించిన ‘ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బైకేష్ బక్షి తదితర మూవీలు కూడా ఇతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.  రబ్జా, వెల్కమ్ టు న్యూయార్క్, నోంచిరియా సినిమాలు మంచి గుర్తింపు నిచ్చాయి. దిల్ బే చారా చిత్రం మే 8 న విడుదల కావలసి ఉండగా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాలేదు. కిస్ దేశ్ మే హీ మేరా దిల్ షో తో తొలిసారి టీవీ సీరియల్ లో సుశాంత్ ఎంట్రీ  ఇచ్చాడు. పవిత్ర రిస్తా సీరియల్ లో నటించిన అంకితను ప్రేమించినా ఆతరువాత 2016 లో ఇద్దరూ విడిపోయారు.

Latest Articles
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?