Karnataka: అనుమానం పెను భూతమైంది.. పద్ధతి మార్చుకోవాలని అత్తింటి వేధింపులు.. భర్త మృతి

|

Sep 05, 2022 | 9:16 AM

అనుమానం నిండు ప్రాణాలు తీసింది. తాను ఊళ్లో లేని సమయంలో భార్య వేరొకరితో సంబంధం ఏర్పరుచుకుందన్న అనుమానంతో తాగొచ్చి గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక విషయాన్ని భార్య తన పుట్టింటి వారికి చెప్పింది. కూతురి...

Karnataka: అనుమానం పెను భూతమైంది.. పద్ధతి మార్చుకోవాలని అత్తింటి వేధింపులు.. భర్త మృతి
Crime News
Follow us on

అనుమానం నిండు ప్రాణాలు తీసింది. తాను ఊళ్లో లేని సమయంలో భార్య వేరొకరితో సంబంధం ఏర్పరుచుకుందన్న అనుమానంతో తాగొచ్చి గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక విషయాన్ని భార్య తన పుట్టింటి వారికి చెప్పింది. కూతురి పరిస్థితి చూసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లుడిని ఇంటికి పిలుపించుకుని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన మహేశ్‌కు స్థానికంగా ఉండే శిల్ప అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వివాహమైన తర్వాత వీరిద్దరూ ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చారు. నగరంలోని కోణనకుంటెలో స్థిరపడ్డారు. అయితే పని విషయమై మహేశ్ అప్పుడప్పుడు మండ్యకు వెళ్తుండేవాడు. ఆ సమయంలో శిల్ప ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో భార్య తీరుపై మహేశ్ అనుమానం పెంచుకున్నాడు. మద్యం తాగి వచ్చి వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక శిల్ప పుట్టింటి వారికి విషయం చెప్పింది.

కూతురి పట్ల అల్లుడు వ్యవహిస్తున్న తీరుపై వారు తీవ్రంగా స్పందించారు. అల్లుడిని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోవాలని సూచించారు. అంతే కాకుండా తీవ్ర ఆగ్రహంతో మహేశ్‌ను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దెబ్బలకు తాళలేక అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని మండ్యకు తీసుకువెళ్లారు. భార్య, వారి తరఫు బంధువులపై అనుమానం రావడంతో మహేశ్‌ తల్లిదండ్రులు మండ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేసుకుని, శిల్పను అదుపులోకి తీసుకున్నారు. శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి.