ఈసారి ఇళ్లల్లోనే గణేష్ నవరాత్రులు: తలసాని

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసారి ఇళ్లల్లోనే గణేష్ నవరాత్రులు: తలసాని
Follow us

|

Updated on: Aug 17, 2020 | 3:53 PM

కరోనా వైరస్ ప్రభావం వినాయక చవితి ఉత్సవాలపై పడింది. వైరస్ విస్తరిస్తుండడంతో సామూహిక ఉత్సవాలపై ప్రభుత్వం అంక్షలు విధిస్తోంది. ఎత్తుగా, భారీగా ఏర్పాటయ్యే గణనాథులను ఈసారి అనూహ్యంగా ఎత్తు తగ్గనున్నాడు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఉత్సవాల నిర్వహణ, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో విగ్రహాల ఎత్తు, ఊరేగింపు, నిమజ్జనం, భక్తుల అనుమతి తదితర అంశాలపై చర్చించారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, పోలీస్ కమిషనర్లు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రజలంతా గణేష్ పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. ఇళ్లలోనే విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని తెలిపారు. గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకూ సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు.