లాక్ డౌన్ లో సింపుల్ మ్యారేజ్… పెళ్లి కొడుకైన నిఖిల్ గౌడ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ-ఎస్ నేత కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ మనుమడు నిఖిల్ గౌడ పెళ్లి శుక్రవారం జరిగింది . అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా బెంగుళూరు లోని వీరి నివాసంలో కాకుండా ఈ నగరానికి సుమారు 28 కి.మీ.

లాక్ డౌన్ లో సింపుల్ మ్యారేజ్... పెళ్లి కొడుకైన నిఖిల్ గౌడ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 17, 2020 | 4:47 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ-ఎస్ నేత కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ మనుమడు నిఖిల్ గౌడ పెళ్లి శుక్రవారం జరిగింది . అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా బెంగుళూరు లోని వీరి నివాసంలో కాకుండా ఈ నగరానికి సుమారు 28 కి.మీ. దూరంలోని రామనగర లో గల వీరి ఫామ్ హౌస్ లో ఈ మ్యారేజ్ జరిగింది. సినీ నటుడు, రాజకీయ నాయకుడు కూడా అయిన నిఖిల్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓ మాజీ మంత్రికి వరుసకు మేనకోడలైన రేవతిని ఈయన వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమానికి తమ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరూ రాకూడదని, కేవలం, 60 నుంచి 70 మంది మాత్రమే, అదికూడా తమ బంధువులను మాత్రం ఆహ్వానిస్తున్నామని కుమారస్వామి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెడ్ జోన్ గా  ప్రభుత్వం ప్రకటించింది. కుమారస్వామి లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని, ఈ రూల్స్ ని అతిక్రమిస్తే వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ హెచ్చరించారు.