19న దేశవ్యాప్తంగా లారీ సమ్మె

సెప్టెంబర్-1,2019నుంచి అమల్లోకి వచ్చిన మోటర్ వెహికల్స్ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీలు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునిచ్చింది. తమ అసమ్మతిని నమోదు చేసుకోవడానికి ఈ సమ్మెలో చేరనున్నట్లు తమిళనాడు ఫుడ్, ఆయిల్ అండ్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.  సెప్టెంబర్ 19 న ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లారీల […]

19న దేశవ్యాప్తంగా లారీ సమ్మె
Follow us

|

Updated on: Sep 17, 2019 | 5:11 PM

సెప్టెంబర్-1,2019నుంచి అమల్లోకి వచ్చిన మోటర్ వెహికల్స్ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీలు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునిచ్చింది. తమ అసమ్మతిని నమోదు చేసుకోవడానికి ఈ సమ్మెలో చేరనున్నట్లు తమిళనాడు ఫుడ్, ఆయిల్ అండ్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.  సెప్టెంబర్ 19 న ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లారీల సమ్మె కొనసాగుతోంది. ఈ మేరకు తమిళనాడు సంఘం కార్యదర్శి జానకిరామన్‌.. మాట్లాడుతూ..కొత్త భారీ జరిమానాలు ఆర్టీఓ అధికారుల జేబులను నింపుకోవటానికి మాత్రమే అని ఆరోపించారు. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేసినందుకు భారీ జరిమానాను విధించడాన్ని యూనియన్ అంగీకరిస్తుందని ఆయన తెలిపారు.