బ్రెయిన్‌స్ట్రోక్‌కు అసలు కారణం..

|

Sep 09, 2019 | 5:06 PM

బ్రెయిన్‌ స్ట్రోక్‌..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది బ్రెయిన్‌స్ట్రోక్‌తోనే మరణిస్తున్నారు. మెదడులో రక్తనాళాలు చిట్లితే బ్రెయిన్ స్ట్రోక్‌‌కు గురవుతారు.. అయితే ఈ బ్రెయిన్‌స్ట్రోక్ ఎక్కువగా నాన్‌ వెజిటేరియన్లకే వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. వాస్తవానికి మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లోనే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని EPIC- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దాదాపు 50 వేల మందిపై సుమారు 18 ఏళ్లపాటు జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అసలు […]

బ్రెయిన్‌స్ట్రోక్‌కు అసలు కారణం..
Follow us on

బ్రెయిన్‌ స్ట్రోక్‌..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది బ్రెయిన్‌స్ట్రోక్‌తోనే మరణిస్తున్నారు. మెదడులో రక్తనాళాలు చిట్లితే బ్రెయిన్ స్ట్రోక్‌‌కు గురవుతారు.. అయితే ఈ బ్రెయిన్‌స్ట్రోక్ ఎక్కువగా నాన్‌ వెజిటేరియన్లకే వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. వాస్తవానికి మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లోనే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని EPIC- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దాదాపు 50 వేల మందిపై సుమారు 18 ఏళ్లపాటు జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అసలు మాంసాహారులకన్నాశాకాహారుల్లోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తేల్చిచెప్పారు. దీనికి గల కారణాలను కూడా ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు తెలిపారు.
శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు గుర్తించారు. తద్వారా మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్‌స్ట్రోక్ సంభవిస్తుందని పరిశోధకులు తెలిపారు. అయితే మాంసాహారుల్లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. రెగ్యులర్‌గా చికెన్, మటన్ తినేవారి కంటే కూరగాయలు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. ఈ వివరాలన్నీ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులు, ఐదో వంతు మంది చేపలు తినేవారు ఉన్నారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు గురయ్యారు. అయితే నేటి పరిస్థితుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారు కావున మాంసాహారం కంటే శాకాహారమే ఒక విధంగా మేలని పరిశోధకులు అంటున్నారు. మొత్తంగా..మాంసాహారంతో గుండెపోటు ముప్పు ఉంటే…శాఖాహారంతో బ్రెయిన్‌స్ట్రోక్ ప్రమాదం ఉందన్న మాట. అయితే శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలతో పాటు, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తిన్నట్లయితే కొలస్ట్రాల్‌ శాతం పెరిగి శాఖాహారులు బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు నుంచి బయటపడవచ్చునని డాక్టర్లు అంటున్నారు.
మొత్తానికి వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ అని కాకుండా..మన శరీర అవసరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేడ్లు కలిగిన అన్నిరకాల కూరగాయలు, పండ్లు,

దుంపలు, పప్పుదినుసులు సమతుల్యంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు.