Heart: మీ గుండె పదిలమేనా.? ఈ పరీక్షలతో ఇట్టే చెప్పేయొచ్చు..

అప్పటి వరకు ఉషారుగా ఉన్న వ్యక్తి ఉన్నపలంగా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. దీంతో గుండె ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరిలో ఆందోళన పెరుగుతోంది. అయితే గుండె ఆరోగ్యంగానే పనిచేస్తుందా.? ఏమైనా సమస్యలు మొదలవుతున్నాయా.? లాంటి వివరాలను ముందుగానే పసిగట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి...

Heart: మీ గుండె పదిలమేనా.? ఈ పరీక్షలతో ఇట్టే చెప్పేయొచ్చు..
Heart Health
Follow us

|

Updated on: Aug 11, 2024 | 7:59 PM

ప్రస్తుతం హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణం ఏదైనా.. గుండె ప్రమాదంలో పడుతోంది. ఉన్నపలంగా చిట్టి గుండె ఆగిపోతోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత గుండె జబ్బులు ఎక్కువుతున్నాయి.

అప్పటి వరకు ఉషారుగా ఉన్న వ్యక్తి ఉన్నపలంగా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. దీంతో గుండె ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరిలో ఆందోళన పెరుగుతోంది. అయితే గుండె ఆరోగ్యంగానే పనిచేస్తుందా.? ఏమైనా సమస్యలు మొదలవుతున్నాయా.? లాంటి వివరాలను ముందుగానే పసిగట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ పరీక్షలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పే వాటిలో ప్రధానమైంది అధిక రక్తపోటు. రక్తపోటు ఎక్కువ కావడమే గుండె సమస్యలకు ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు ఈ బీపీని చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

* రక్తంలో పెరిగే కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులను అడ్డుకుంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, మీ కొలెస్ట్రాల్‌ను పరీక్షించుకోండి, తద్వారా గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేసుకోవచ్చు.

* ఇక గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పే మరో పరీక్ష ఈసీజీ.. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పరీక్షిస్తుంది. ఈ పరీక్ష హృదయ స్పందన సాధారణమైనదా లేదా అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. హృదయ స్పందనలలో ఏదైనా ఆటంకం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* అలాగే డయాబెటిస్‌ రోగులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్‌ టెస్ట్ చేసుకోవాలి. చక్కెర స్థాయి అదుపులో ఉండేలా చూసుకోవాలి.

* ట్రైగ్లిజరైడ్స్ అనేది రక్తంలో ఉండే ఒకరమైన కొవ్వు. శరీరంలో ఇది పెరుగుతున్నా కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ట్రైగ్లిజరైడ్‌ టెస్ట్ చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

* శారీరక శ్రమ చేసే సమయంలో గుండె పనితీరు ఎలా ఉందన్న పరీక్ష ద్వారా కూడా గుండె ఆరోగ్యం అంచనా వేయొచ్చు. ఈ పరీక్షను టీఎమ్‌టీగా చెబుతుంటారు. ఈ పరీక్షలో భాగంగా ఒక వ్యక్తిని ట్రెడ్‌మిల్‌పై నడిపిస్తుంటారు. ఈ సమయంలో గుండె కొట్టుకోడం, రక్తపోటును స్థాయిలను అంచనా వేస్తుంటారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..