ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కింద సాధారణంగా బ్రెడ్, రోల్స్, చపాతీ, ఇడ్లీ, పరాటా వంటివి తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి టీతోపాటు పరాటీ తినే అలవాటు ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉంటే పరాటా విత్ టీ చాలా మంది తినడానికి ఇష్టపడతారు. ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
టీతో కలిపి పరాటా తినడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. పరాటాలో అధిక క్యాలరీలు ఉంటాయి. పైగా కొవ్వు పదార్ధాలు, శుద్ధి చేసిన పిండి, నూనెతో పరాటాలను తయారు చేస్తారు
TV9 Telugu
వీటిని రోజు ప్రారంభంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై దుష్ర్ఫభావం పడుతుంది. బదులుగా బచ్చలికూర, మెంతికూరతో మీరు పిండిని పిసికి పరాటా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పరోటా చాలా హెల్తీగా తయారవుతుంది
TV9 Telugu
పరాటా తయారీలో చిక్‌పీస్, పనీర్‌లను కూడా ఉపయోగించవచ్చు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, ముల్లంగి వంటి వాటిని తీసుకోకపోవడమే మంచిది
TV9 Telugu
పిండి పిసికేటప్పుడు పచ్చి ఆకుకూరలు వేసి పరాటా తయారు చేసుకోవచ్చు. పరాటాలు వేయించేటప్పుడు నూనెపై అధిక శ్రద్ధ పెట్టాలి. తెల్ల నూనెను ఉపయోగించకూడదు
TV9 Telugu
పరాటాతో టీ తీసుకోకపోవడమే మంచిది. బదులుగా పరాటా తిన్న అరగంట తర్వాత టీ తాగాలి. పరాటా తిన్న వెంటనే టీ తీసుకోవడం వల్ల టీలో టానిన్లు ఉండటం వల్ల ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది
TV9 Telugu
ఈ కాంబినేషన్ మీ జీర్ణక్రియకు భంగం కలిగించవచ్చు. ఇది కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బదులుగా పరోటాను పెరుగుతో కలిపి తినవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులకు మేలు చేస్తాయి