నిజానికి మటన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుందని అంటుకుంటాం. అయితే కొద్ది మోతాదులో మటన్ తీసుకుంటే కొవ్వును కరిగిస్తుంది. ఇందులోని బీ12 శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వును కరిగిస్తుంది.
గర్భిణీలకు మటన్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు క్రమం తప్పకుండా మటన్ తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లాంటి సమస్యలు దరిచేరవు.
మటన్‌లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో ఎముకలకు, దందాలకు కావాల్సిన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మటన్‌ను వారంలో ఒకసారి తీసుకున్నా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బీ కాంప్లెక్స్,సెలీనియం,కొలీనియం ఉండటం వల్ల క్యాన్స్ ర్ నుంచి తప్పించుకోవచ్చు.
మటన్‌లో పొటాషియం సైతం తగిన మోతాదులో ఉంటుంది. దీని కారణంగా రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశాల నుంచి తగ్గించుకోవచ్చు.
ఇక మటన్ లివర్ సైతం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది.
రోగ నిరోధక శక్తి బలోపేతంలో కూడా మటన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని విటమిన్ బీ12 తరచూ అంటు వ్యాధులకు గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.