ఇలా చేస్తే దోమలు దరి చేరవు..

| Edited By:

Sep 16, 2019 | 5:40 PM

వర్షాకాలంతో పాటుగానే వైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ చేస్తాయి. వానాకాలంలో చెరువులు, కుంటలు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి. ఇంటితో పాటు మన పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ..దొమలు చేరకుండా చూసుకోవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కుండీల్లో మొక్కలకు వేసే ఉల్లి పొట్టుని, గుడ్డు పెంకుల్ని, వాడేసిన కాఫీ పొడిని […]

ఇలా చేస్తే దోమలు దరి చేరవు..
Follow us on
వర్షాకాలంతో పాటుగానే వైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ చేస్తాయి. వానాకాలంలో చెరువులు, కుంటలు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి. ఇంటితో పాటు మన పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ..దొమలు చేరకుండా చూసుకోవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కుండీల్లో మొక్కలకు వేసే ఉల్లి పొట్టుని, గుడ్డు పెంకుల్ని, వాడేసిన కాఫీ పొడిని వర్షాకాలం పోయేంత వరకు వేయకుండా ఉంటే మంచిది.
వర్షకాలంలో వైరల్‌ ఫీవర్ల నివారణకు చిట్కాలు..
వైరల్ ఫీవర్లు రాకుండా ముందు జాగ్రత్త కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు అవేంటో చూద్దాం..
వారానికి రెండు మూడు సార్లు.. గుప్పెడు తులసి ఆకులను కప్పు నీటిలో మరిగించి గోరు వెచ్చగా ఉండగానే, ఆకులతో పాటు తాగేయాలి.
యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు సమపాళ్లలో తీసుకుని కప్పు వేడినీటిలో స్పూన్‌ తేనే కలిపి వడగట్టి తాగాలి.
రెండు చెంచాల ధనియాలను కప్పు నీటిలో మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా రోజుకి నాలుగైదు సార్లు తాగుతుంటే ఉపశమనం ఉంటుంది.
తరచూ అనారోగ్యాలకు గురికాకుండా వుండాలంటే రోజూ మొదట తాగే వాటర్ గోరు వెచ్చని నీటితో ప్రారంభించండి.
ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి.
వెల్లుల్లిని ఎండబెట్టి పొడి చేసి కర్పూరంతో కలిపి ధూపంలా వేస్తే ఆ పొగకు దోమలు రావు.
ఘాటైన సువాసన కలిగిన మొక్కల్ని పెంచడం ద్వారా కూడా దోమలు రాకుండా నివారించొచ్చు.
సిట్రెనెల్లా, లెమన్ బామ్, బంతి, జెరానియం, మాచిపత్రి మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి.