మందుబాబుల్లో లివర్‌ వ్యాధులు ! బీరతోనే చెక్‌ !

| Edited By: Srinu

Dec 04, 2019 | 5:23 PM

మద్యం అలవాటు చాలా మందిని రోగాల బారినపడేస్తుంది. వారిలో అధికశాతం మంది లివర్‌ వ్యాధులతో బాధపడుతుంటారు. అనేక సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మద్యపానం అలవాటుతో రోగాలపాలైన వారికి బీరకాయ ఎంతో  మేలుచేస్తుందంటున్నారు వైద్యులు. శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతగానో ఉపయోగపడుతుందట. చెడు రక్తాన్ని శుద్ధి చేయడంలో బీరకాయను మించిన కూరగాయ లేదంటున్నారు వైద్యనిపుణులు. * బీరకాయలోని బీటా కెరోటిన్‌ అనే పదార్థం రక్తాన్ని శుభ్రపరిచి కంటి చూపును మెరుగుపరుస్తుంది. లివర్‌, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. […]

మందుబాబుల్లో లివర్‌ వ్యాధులు ! బీరతోనే చెక్‌ !
Follow us on

మద్యం అలవాటు చాలా మందిని రోగాల బారినపడేస్తుంది. వారిలో అధికశాతం మంది లివర్‌ వ్యాధులతో బాధపడుతుంటారు. అనేక సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మద్యపానం అలవాటుతో రోగాలపాలైన వారికి బీరకాయ ఎంతో  మేలుచేస్తుందంటున్నారు వైద్యులు. శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతగానో ఉపయోగపడుతుందట. చెడు రక్తాన్ని శుద్ధి చేయడంలో బీరకాయను మించిన కూరగాయ లేదంటున్నారు వైద్యనిపుణులు.
* బీరకాయలోని బీటా కెరోటిన్‌ అనే పదార్థం రక్తాన్ని శుభ్రపరిచి కంటి చూపును మెరుగుపరుస్తుంది. లివర్‌, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.
* రక్తం శుద్ధితో లివర్‌ పనితీరు మెరుగుపడుతుంది.
* బీరకాయలో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంతో పాటు, బరువు పెరగకుండా చూస్తుంది.
* లివర్‌కు సంబంధించి పచ్చ కామెర్లు (జాండీస్‌)తో బాధపడుతున్న వారు బీరకాయ జ్యూస్ తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. కామెర్లు తగ్గుముఖం పడతాయి.
* విటమిన్ సి, రిబోఫ్లోవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
* బీరకాయలోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
* బీరకాయ ను జ్యూస్‌లాగా తీసుకున్నా, పచ్చడిలా తీసుకున్న షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. అంతే కాదు మద్యం అధికంగా సేవించడం వల్ల పాడైన లివర్‌ని కూడా బీరకాయ కాపాడుతుందంటున్నారు వైద్యనిపుణులు. అలాగని, మితిమీరిన ఆల్కహాల్‌ అలవాటు ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.