Brushing: మీరు బ్రష్ సరిగ్గా చేయడం లేదా.. అయితే ఈ వ్యాధుల బారిన పడ్డట్టే, ఎందుకంటే

|

Apr 04, 2024 | 2:56 PM

మీరు బ్రష్ సరిగ్గా చేయడం లేదా..? జస్ట్ బ్రష్ కదా.. అని లైట్ గా తీసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. దంతాలను బ్రష్ చేయకపోవడం వల్ల నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది ఓ డెంటిస్ట్ తేల్చి మరి చెప్పాడు. సక్రమంగా బ్రష్ చేయకపోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిసింది.

Brushing: మీరు బ్రష్ సరిగ్గా చేయడం లేదా.. అయితే ఈ వ్యాధుల బారిన పడ్డట్టే, ఎందుకంటే
Brushing
Follow us on

మీరు బ్రష్ సరిగ్గా చేయడం లేదా..? జస్ట్ బ్రష్ కదా.. అని లైట్ గా తీసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. దంతాలను బ్రష్ చేయకపోవడం వల్ల నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది ఓ డెంటిస్ట్ తేల్చి మరి చెప్పాడు. సక్రమంగా బ్రష్ చేయకపోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిసింది. అయితే నోటిలో కనిపించే సూక్ష్మజీవులు దిగువకు వెళ్లి కడుపు ఆమ్లాలపై ప్రభావితం చేయగలవని అమెరికాలోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు.  ఇది కొలొరెక్టల్ క్యాన్సర్లకు కారణమవుతుందని తేల్చి చెప్పారు. అంతేకాదు.. 200 ప్రేగు క్యాన్సర్ కేసులను అంచనా వేశారు. ఇక కణితులలో సగం సూక్ష్మజీవులను కలిగి ఉన్నాయని వైద్యలు గుర్తించారు.

అయితే పరిశోధనల ప్రకారం.. సూక్ష్మజీవులు క్యాన్సర్ పురోగతిని ప్రేరేపిస్తాయి. ఇది కాలక్రమేణా ప్రాణాంతకంగా మారుతుంది. దంతాల అశుభ్రత, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం మధ్య సంబంధం ఉందని పలు హెల్త్ స్టడీలు చెబుతున్నాయి. అయితే నోటిలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉండటం సహజమని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, సరైనవిధంగా బ్రష్ చేయకపోతే పెద్దప్రేగుకు చేరుకుని అవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇక నోటిలోని క్రీములు ఇతర శరీర భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటమ్ అని పిలువబడే ఈ బ్యాక్టీరియా కొలొరెక్టల్ క్యాన్సర్ కారకాలకు దారితీస్తుంది. మంచిగా బ్రష్ చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంది. కాబట్టి అన్ని వయసు వారు రోజూ ఉదయం పళ్ళు సక్రమంగా తోముకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే చాలామంది ఒకే బ్రష్ ను చాలాకాలం పాటు వాడుతున్నారు. కచ్చితంగా మూడు లేదా ఆరు నెలలోకోసారి బ్రష్ ను మారుస్తూ ఉండాలి. అప్పుడే దంతాల శుభ్రతతో పాటు ఆరోగ్యం బాగుంటుంది.