Rashmika madanna: రష్మిక ఎంత కష్టపడుతుందో చూశారా.. ఇంతకీ ఆ వ్యాయామం ఏంటి? దీని ప్రయోజనాలేంటి?

|

Feb 06, 2023 | 3:45 PM

రష్మిక పోస్ట్ చేసిన జిమ్ వీడియోలో ఆమె క్లోజ్-గ్రిప్ పుష్-అప్‌లు చేస్తూ కనిపిస్తుంది. రెండు మెడిసిన్ బాల్స్‌పై పుష్-అప్‌లు చేస్తుంది. ఇది చూడటానికి ఎంతో ఈజీగా కనిపిస్తున్నా చేయడం కొంచెం కష్టమే.

Rashmika madanna: రష్మిక ఎంత కష్టపడుతుందో చూశారా.. ఇంతకీ ఆ వ్యాయామం ఏంటి? దీని ప్రయోజనాలేంటి?
Rashmika Mandanna
Follow us on

రష్మిక మందన.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన మూవీ అప్డేట్స్.. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్ల అటెన్షన్ డ్రా చేస్తుంటారు. ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. గతేడాది పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు బాలీవుడ్‏లోనూ సత్తా చాటుతోంది. బీటౌన్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తుంది. కాగా ఆమె తన ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయం తన ఫాలోవర్లకు బాగా తెలుసు. తన వర్క్ అవుట్లకు సంబంధించిన వీడియోలు కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఇదే క్రమంలో కొన్ని రోజుల కిందట తన ఇన్ స్టా గ్రామ్ (rashmika_mandanna) పేజీపై ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఏమిటో తెలుసా.. ‘ నేను ఒకప్పుడు బలమైన మహిళలను చూసి.. నేను కూడా వారిలాగే ఉంటే బాగుండునని నాలో అనుకునేదాన్ని.. కానీ ఈ రోజు నేను ఈ వీడియోలను చూసి నేనే ఆ బలమైన మహిళలను అని చెప్పుకోగలుతున్నా.. కృషి, పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తూనే ఉంటే ఏదైనా సాధించగలం.’ అని రాశారు. ఈ జిమ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఏముంది..

రష్మిక పోస్ట్ చేసిన జిమ్ వీడియోలో ఆమె క్లోజ్-గ్రిప్ పుష్-అప్‌లు చేస్తూ కనిపిస్తుంది. రెండు మెడిసిన్ బాల్స్‌పై పుష్-అప్‌లు చేస్తుంది. ఇది చూడటానికి ఎంతో ఈజీగా కనిపిస్తున్నా చేయడం కొంచెం కష్టమే. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాయామం ఉద్దేశం ఏమిటి? ఎందుకు చేస్తారు? ప్రయోజనాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.. మెడిసిన్ బాల్ క్లోజ్-గ్రిప్ పుష్-అప్‌లు పూర్తి-శరీర వ్యాయామం. ఇది ఎగువ-శరీర బలాన్ని, కోర్ బలాన్ని పెంచుతుంది. కార్డియోను మెరుగుపరుస్తుంది. ట్రైసెప్స్‌ను చురుకుగా ఉంచడానికి ఇది ప్రభావవంతమైన ట్రిక్. మెడిసిన్ బాల్‌ను ఉపయోగించి పుష్-అప్‌లు చేయడం వల్ల మీ శరీరం చురుకుగా మారుతుంది. ఈ ఛాలెంజింగ్ బాడీ వెయిట్ వర్కౌట్ మీ పెక్టోరల్‌లను బలోపేతం చేస్తుంది. కొవ్వును వేగంగా కరిగిస్తుంది.

ఎలా చేయాలంటే..

2-10 కిలోల మెడిసిన్ బంతిని తీసుకోండి. చిన్న బంతిని తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయి. పుష్-అప్‌ల ప్రారంభ భంగిమ చేస్తున్నప్పుడు, బంతిని మీ ఛాతీ కింద ఉంచండి. ఇప్పుడు మీ వీపును నిటారుగా ఉంచుతూ పుష్-అప్స్ చేయండి. మీరు నెమ్మదిగా మీ ఛాతీని బంతి వైపుకు తగ్గించేటప్పుడు మీ మోచేతులను వంచండి. మీ మోచేతుల కోణం బయటికి కాకుండా వాలుగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..