Headache: సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు..

|

Apr 25, 2024 | 11:14 AM

భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. కాలు అడుగుతీసి బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడం సర్వసాధారణం. దీనివల్ల తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. అయితే సమ్మర్‌లో వచ్చే తలనొప్పి...

Headache: సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు..
Headache In Summer
Follow us on

భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. కాలు అడుగుతీసి బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడం సర్వసాధారణం. దీనివల్ల తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. అయితే సమ్మర్‌లో వచ్చే తలనొప్పి సమస్యకు కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా చెక్‌ పెట్టొచ్చు. తలనొప్పి దూరం చేసే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* డ్రైఫ్రూట్స్‌ నేచురల్‌ పెయిన్‌ కిల్లర్స్‌లాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులతో నొప్పికి ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు. ప్రతీ రోజూ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే తలనొప్పి సమస్య ఇట్టే దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక అల్లం కూడా తలనొప్పికి చెక్‌ పెట్టొచ్చు. ఇందుకోసం కొన్ని గోరు వెచ్చని నీటిలో అల్లం రసం వేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

* సమ్మర్‌లో వీలైనంత వరకు మసాలా ఫుడ్‌ను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల డీహైడ్రేషన్‌ సమస్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* ఇక సమ్మర్‌లో తలనొప్పికి ప్రధాన కారణాల్లో డీహైడ్రేషన్‌ ఒకటి. అందుకే క్రమతప్పకుండా నీటిని తీసుకుంటూ ఉండాలి. కేవలం నీరు మాత్రమే కాకుండా మజ్జిగా, నిమ్మరసం వంటివి అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

* సమ్మర్‌లో ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు అరటి పండు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం పూట వచ్చే తలనొప్పి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

* ఇక ఎండలో బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా క్యాప్‌ ధరించాలి. మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండడమే మంచిది. అలాగే బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా వెంట నీటిని తీసుకెళ్లాలి.

* సమ్మర్‌లో తలనొప్పి రావడానికి నిద్రలేమి కూడా ఒక కారణంగా చెబుతుంటారు. కాబట్టి మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్ర పోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..