అలాంటివి చేయనంటున్న’అందాల రాక్షసి’.. దీనిపై అందరికీ ఓ క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..

అందాల రాక్షసి సినిమా ఫేం హీరోయిని లావణ్య త్రిపాఠి వాణిజ్య ప్రకటనలను చేయనని తెగేసి చెబుతోంది. సొట్ట బుగ్గలతో, వయ్యారాలు ఒలకబోస్తూ అందరిని మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీ వరుస విజయలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది.

అలాంటివి చేయనంటున్న'అందాల రాక్షసి'.. దీనిపై అందరికీ ఓ క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..
Follow us

|

Updated on: Nov 28, 2020 | 10:00 AM

అందాల రాక్షసి సినిమా ఫేం హీరోయిని లావణ్య త్రిపాఠి వాణిజ్య ప్రకటనలను చేయనని తెగేసి చెబుతోంది. సొట్ట బుగ్గలతో, వయ్యారాలు ఒలకబోస్తూ అందరిని మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీ వరుస విజయలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. తన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది.

ఇటీవల ఈమె కోసం ప్రొడ్యూసర్స్ పోటి పడుతున్నట్లుగా సమాచారం. మరి అంతగా ఈ అమ్మడు దగ్గర ఏముందో తెలియదు. ప్రస్తుతం యువ హీరో సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చేస్తోంది. అంతేకాదు ఇందులో హాకీ ప్లేయర్‌గా తన ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇందుకోసం హాకి శిక్షణ కూడా తీసుకుంటోంది ఈ భామ. అలాగే కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది. మంచి ఊపుమీదున్న లావణ్యకు ఈ మధ్య ఓ ఆఫర్ వచ్చింది. ఓ లిక్కర్ బ్రాండ్ కోసం ఫొటో షూట్, యాడ్స్ ఇవ్వాలని ఓ బడా సంస్థ కోరిందట. అయితే దానికి ఆమె నో చెప్పేసిందని సమాచారం. దండిగా డబ్బులు వచ్చే ఆ ప్రకటనను లావణ్య ఎందుకు తిరస్కరించిందని అందరు అంటేంటే దీనికి ఆమె ఓ క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్యానికి హాని కలిగించే ప్రకటనలను చేయొద్దని నిర్ణయించుకున్నానని తెగేసి చెప్పింది. ఈమెకు వచ్చినవి లిక్కర్ బ్రాండ్‌కి సంబంధించిన ప్రకటనలు కాబట్టి తిరస్కరించానని తెలిపింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తన మనుసులో మాట చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు చేసిన పనిని ఇప్పడు అందరూ మెచ్చుకుంటున్నారు.