ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆగ్రహం

|

Sep 19, 2020 | 7:24 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పెద్దలకు స్థలాలిచ్చారని, అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారని వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని చేస్తున్న

ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆగ్రహం
Follow us on

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పెద్దలకు స్థలాలిచ్చారని, అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారని వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానాలే అడ్డుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పెద్దలుండే చోట పక్కన పేదలు నివాసం ఉండడానికి అనర్హులా? భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు ఇదేనా? అని ఆపార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. శనివారం పార్లమెంట్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ అక్రమాలపై ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరుతున్నామన్నారు. న్యాయమూర్తులపై నిందారోపణలున్నాయి కాబట్టే కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పిల్లి సుభాష్ అన్నారు. ఇక, ఏపీ సర్కారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై న్యాయస్థానాలు స్పందిస్తున్న తీరు వివాదాస్పదంగా మారిందన్నారు మోపిదేవి. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో బడుగు, బలహీనవర్గాల ప్రజల నుంచి భూములను రాజధాని కోసం సేకరించారని మోపిదేవి తెలిపారు. ఆ క్రమంలో రకరకాల అక్రమాలకు, వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మోపిదేవి ఆరోపించారు. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణం, అంతర్వేది రథం ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి చెప్పారు.