Yes Bank Fraud: కాంగ్రెస్ మెడకు ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ ? రాణా తెచ్చిన ట్రబుల్ !

| Edited By: Pardhasaradhi Peri

Mar 10, 2020 | 4:10 PM

Yes Bank Fraud:  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్ కి అమ్మిన పెయింటింగ్.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటాన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రపటాన్ని  తాను రూ. 2 కోట్లకు కపూర్ కి అమ్మినట్టు ప్రియాంక గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని విషయమై ఈడీ అధికారులు త్వరలో ఆమెకు సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..  సిమ్లా దగ్గరి ఆమె కాటేజీని వారు ఎటాచ్ (స్వాధీనం) చేసుకోనున్నారని సమాచారం. […]

Yes Bank Fraud: కాంగ్రెస్ మెడకు ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ ? రాణా తెచ్చిన ట్రబుల్ !
Follow us on

Yes Bank Fraud:  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్ కి అమ్మిన పెయింటింగ్.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటాన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రపటాన్ని  తాను రూ. 2 కోట్లకు కపూర్ కి అమ్మినట్టు ప్రియాంక గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని విషయమై ఈడీ అధికారులు త్వరలో ఆమెకు సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..  సిమ్లా దగ్గరి ఆమె కాటేజీని వారు ఎటాచ్ (స్వాధీనం) చేసుకోనున్నారని సమాచారం. ప్రియాంక తండ్రి రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఆమె నుంచి కొనుగోలు చేయవలసిందిగా కాంగ్రెస్ నేత, దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవర తనపై ఒత్తిడి తెచ్చారని రాణాకపూర్ గత ఆదివారం ఈడీ అధికారులకు ఇఛ్చిన వాంగ్మూలంలో తెలిపారు. యాంటీ మనీ లాండరింగ్ చట్టం కింద.. ఎస్ బ్యాంక్ స్కామ్ లో నిందితుడైన కపూర్ నుంచి సొమ్ము తీసుకుని.. దాన్ని సిమ్లా సమీపంలోని తన కాటేజీ కోసం ప్రియాంక వినియోగించుకోవడం ‘ప్రోసీడ్స్ ఆఫ్ క్రైమ్’ కిందికి వస్తుందని ఈడీ భావిస్తోంది. అంటే ఆ ఆస్తిని ఎటాచ్ చేసుకోవడానికి అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మిలింద్ దేవరను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించవచ్ఛు. అయితే ప్రియాంక చర్య చట్ట సమ్మతమైనదేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ చిత్రపటాన్ని రెండు కోట్లకు కొనుగోలు చేసిన విషయాన్ని ఆమె దాచిపెట్టలేదని, 2010 లో తాను దాఖలు చేసిన ఇన్ కమ్ టాక్స్ రిటర్నులలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆ చిత్రపటాన్ని ఎటాచ్ చేసిన ఈడీ

రాణాకపూర్ కు ప్రియాంక అమ్మిన రాజీవ్ గాంధీ పెయింటింగును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని కపూర్ నివాసం నుంచి దాన్ని ఎటాచ్ చేశారు. 1985 లో ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ వేసిన ఈ పెయింటింగును కాంగ్రెస్ శతాబ్ది వేడుకల సమయంలో ప్రియాంక తండ్రి రాజీవ్ గాంధీకి బహుకరించారు. ఆ తరువాత 2010 లో దీన్ని ప్రియాంక.. కపూర్ కి రెండు కోట్లకు అమ్మారు.  అప్పట్లో ఆయనకు ఆమె ఓ లేఖ రాస్తూ.. ‘ మా నాన్నగారి చిత్రపటాన్ని కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలని, నాడు ఎం.ఎఫ్ హుసేన్ వేసిన ఈ చిత్రపటం తనవద్ద ఉండడం తనకెంతో ఆనందదాయకమని’ పేర్కొన్నారు. కాగా-ఇదే సమయమని బీజేపీ.. ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేస్తూ.. దేశంలో ఏ నేర సంబంధ ఘటన జరిగినా దాని మూలాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయంటూ ధ్వజమెత్తింది.