బీహార్ లో యశ్వంత్ సిన్హా పొలిటికల్ ఫ్రంట్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 11:21 AM

బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రెండేళ్ల క్రితం తానిక రాజకీయాలకు స్వస్తి చెబుతానని 'పొలిటికల్ సన్యాసం' స్వీకరించిన ఈయన.. తిరిగి క్రియాశీల నేత అవుతున్నారు. తను ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నానని..

బీహార్ లో యశ్వంత్ సిన్హా పొలిటికల్ ఫ్రంట్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం
Follow us on

బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రెండేళ్ల క్రితం తానిక రాజకీయాలకు స్వస్తి చెబుతానని ‘పొలిటికల్ సన్యాసం’ స్వీకరించిన ఈయన.. తిరిగి క్రియాశీల నేత అవుతున్నారు. తను ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నానని, ఈ సంవత్సరాంతంలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన పాట్నాలో ప్రకటించారు. ‘బెటర్ బీహార్ అన్నదే తమ నినాదమని, తమ ఫ్రంట్ ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్మ్ ఆర్జేడీ పార్టీలతో మహాకూటమిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ కొత్త పేరును త్వరలో ప్రకటిస్తామన్నారు. లోగడ ఏబీ వాజ్ పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా ఆర్ధిక, విదేశాంగ శాఖల మంత్రిగా వ్యవహరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతున్న యశ్వంత్ సిన్హా.. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. అందువల్లే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృధ్ది పథంలో నడిపించేందుకు ఈ ఫ్రంట్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.