ఈ సీరియల్ రేపిస్టును ఏం చేయాలి ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 07, 2020 | 6:46 PM

ప్రపంచంలోనే అత్యధికంగా అత్యాచారాలు, ఘోరాలు చేసినవాడిగా ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి ‘ అన్ పాపులర్ ‘ అయ్యాడు. 36 ఏళ్ళ ఇతని పేరు రీనార్డ్ సినాగా.. ఇండోనేసియాలో ఓ ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఇతడి నేర చరిత్ర చూస్తే నిర్ఘాంతపోవల్సిందే.. 195 మంది పురుషుల మీద దాడులు, 136 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. గే కూడా అయిన సినాగా .. బ్రిటన్ లోని మాంచెస్టర్ నివాసి అట.. […]

ఈ సీరియల్ రేపిస్టును ఏం చేయాలి ?
Follow us on

ప్రపంచంలోనే అత్యధికంగా అత్యాచారాలు, ఘోరాలు చేసినవాడిగా ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి ‘ అన్ పాపులర్ ‘ అయ్యాడు. 36 ఏళ్ళ ఇతని పేరు రీనార్డ్ సినాగా.. ఇండోనేసియాలో ఓ ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఇతడి నేర చరిత్ర చూస్తే నిర్ఘాంతపోవల్సిందే.. 195 మంది పురుషుల మీద దాడులు, 136 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. గే కూడా అయిన సినాగా .. బ్రిటన్ లోని మాంచెస్టర్ నివాసి అట.. ఇతడ్ని పోలీసులు కోర్టులో హాజరు పరిచినప్పుడు జడ్జి.. ‘ రాక్షసుడు ‘ అని అభివర్ణించారంటే ఇతగాని క్రిమినాలజీ ఎలాంటిదో తెలుస్తోంది. ఎనిమిది అత్యాచార యత్నాలు, 48 మందిపై అసభ్య నేరాలకు కూడా పాల్పడిన సినాగా కు న్యాయమూర్తి 30 ఏళ్ళ జైలుశిక్ష విధించారు . నైట్ క్లబ్బులకు వెళ్ళినప్పుడు తాను టార్గెట్ చేసుకున్న వ్యక్తులకు సినాగా .. తన ఇంటికి ఆహ్వానించి వారికి  డ్రగ్స్ తో కూడిన మద్యాన్ని ఇచ్చేవాడని, వారిపై దాడులకు దిగేవాడని తెలిసింది. తమ కొడుకు గే అని గానీ, సీరియల్ రేపిస్టు అని గానీ తెలియని ఇతని తలిదండ్రులు తాజా విషయం తెలిసి ఖంగు తిన్నారు. 2007 లో ఇండోనేసియా నుంచి బ్రిటన్ చేరుకున్న ఈ నేరస్థుడు మాంచెస్టర్ యూనివర్సిటీ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందాడట. అయితే ఎందుకో ఇలా మారిపోయాడు.