మెజారిటీ ఉందా ? ప్రూవ్ చేయండి.. ‘ కమలానికి ‘ సేన సవాల్ !

| Edited By:

Nov 07, 2019 | 6:10 PM

మహారాష్ట్రలో శివసేన తన వైఖరిపై మరింత పట్టు బిగించింది. బీజేపీతో అటోఇటో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై సేనకు, కమలనాథులకు మధ్య పేచీ నేటికి పదో రోజుకు చేరుకుంది. ‘ మా డిమాండ్లను తీర్చకుంటే మేం ఇతర మార్గాలను వెదుక్కుంటాం ‘ అని సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే అన్నారు.. ఈ మేరకు శివసేన తన ‘ సామ్నా ‘ పత్రికలో బీజేపీకి సవాల్ విసిరింది. తమ బలం ఎంత ఉందో, కాంగ్రెస్, ఎన్సీపీ ల […]

మెజారిటీ ఉందా ? ప్రూవ్ చేయండి..  కమలానికి  సేన సవాల్ !
Follow us on

మహారాష్ట్రలో శివసేన తన వైఖరిపై మరింత పట్టు బిగించింది. బీజేపీతో అటోఇటో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై సేనకు, కమలనాథులకు మధ్య పేచీ నేటికి పదో రోజుకు చేరుకుంది. ‘ మా డిమాండ్లను తీర్చకుంటే మేం ఇతర మార్గాలను వెదుక్కుంటాం ‘ అని సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే అన్నారు.. ఈ మేరకు శివసేన తన ‘ సామ్నా ‘ పత్రికలో బీజేపీకి సవాల్ విసిరింది. తమ బలం ఎంత ఉందో, కాంగ్రెస్, ఎన్సీపీ ల బలం ఎంత ఉందో తాము బేరీజు వేసుకుంటున్నామని, అలాగే తమకు మద్దతునిచ్ఛే ఇండిపెండెంట్ సభ్యుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని సేన పేర్కొంది. తాము మెజారిటీ మార్క్ కు చేరుకోవాలనే లక్ష్యంతో ఇందుకు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిపింది. తాము మొదట లొంగే ప్రసక్తే లేదని, అసెంబ్లీలో మీ మెజారిటీని నిరూపించుకోవాలని బీజేపీని సేన నేతలు డిమాండ్ చేశారు. మీరు విఫలమైన పక్షంలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అన్నారు. ఎన్సీపీ తరఫున 54 మంది, కాంగ్రెస్ నుంచి 44 మంది ఎమ్మెల్యేలు, కొందరు స్వతంత్ర సభ్యులు ఉన్నారని, దీంతో తాము మెజారిటీకి చేరువలో ఉన్నామని ఈ పత్రిక ద్వారా వారు స్పష్టం చేశారు. శివసేన తన సొంత సీఎం ని ఎన్నుకుంటుంది.. స్వతంత్ర ఐడియాలజీతో కూడిన మూడు పార్టీలు విధానాలు నిర్ణయిస్తాయి. అవి అందరికీ ఆమోదయోగ్యమవుతాయి అని ‘ సామ్నా ‘ పేర్కొంది.
తమ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించినప్పటికీ.. శివసేన చేస్తున్న డిమాండులో తప్పేమీ లేదని ఆయన ‘ క్లారిటీ ‘ ఇవ్వడం విశేషం. దీంతో సేన ‘ ఉబ్బితబ్బిబ్బవుతోంది ‘. ఇలా ఉండగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే నిన్న శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఈ పార్టీ ఒక సీటును గెలుచుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి సీటూ లెక్కలోకి వస్తుందని ఈ పార్టీ వర్గాలు అంటున్నాయి.