ఆస్ట్రేలియాతో చైనా కయ్యం.. పీఎం స్కాట్ మారిసన్ ఆగ్రహం

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2020 | 3:27 PM

ఆస్ట్రేలియా, చైనా దేశాల మధ్య ఉద్రిక్థతలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, దాని వ్యాప్తిపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని ఆస్ట్రేలియా చేసిన డిమాండుపై చైనా భగ్గుమంది.  ఈ వైరస్ మీద..

ఆస్ట్రేలియాతో చైనా కయ్యం.. పీఎం స్కాట్ మారిసన్ ఆగ్రహం
Follow us on

ఆస్ట్రేలియా, చైనా దేశాల మధ్య ఉద్రిక్థతలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, దాని వ్యాప్తిపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని ఆస్ట్రేలియా చేసిన డిమాండుపై చైనా భగ్గుమంది.  ఈ వైరస్ మీద స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ లాబీ నెరపడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో దీనికి మద్దతు తెలుపుతూ ఓటింగ్ చేపట్టింది.మేమూ ఏమీ తక్కువ తినలేదన్నట్టు చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగింది.  ఆస్ట్రేలియాలో చదువులు చదవాలనుకుంటున్న తమ దేశ విద్యార్థులు తమ ఆలోచనను పునఃపరిశీలించుకోవాలని చైనా కోరింది. అలాగే ఆ దేశానికి వెళ్లరాదని తమ టూరిస్టులపై ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా నుంచి బీఫ్ దిగుమతులను నిషేధించడమే కాక.. ఆ దేశ బార్లీపై సుంకాలను పెంచింది. ఇలాంటి చర్యలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తాము ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రపంచంలోనే తమ దేశ టూరిజం  ప్రాడక్టులకు సాటి లేదని ఆయన అంటున్నారు.  మమ్మల్ని ఎవరూ బెదిరించజాలరు.. అదే జరిగితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మాకు బాగా తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.