మహిళలే మహరాణులు… గ్రేటర్ హైదరాబాద్‌లో మేయర్ పీఠంను మహిళలకే కేటాయించిన ఎన్నికల అధికారులు

గ్రేటర్ హైదరాబాద్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది. అంతా అనుకున్నట్లుగానే మేయర్ పీఠం మహిళలకు కేటాయించారు. జీహెచ్‌ఎంసీకి డిసెంబర్‌ ఒకటిన జరుగనున్న ఎన్నికల్లో మేయర్‌ పదవిని ఈసారి మహిళకు కేటాయించారు. అలాగే జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల్లో 50 శాతం...

మహిళలే మహరాణులు... గ్రేటర్ హైదరాబాద్‌లో మేయర్ పీఠంను మహిళలకే కేటాయించిన ఎన్నికల అధికారులు
Follow us

|

Updated on: Nov 18, 2020 | 3:38 PM

Hyderabad to get Woman Mayor : గ్రేటర్ హైదరాబాద్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది. అంతా అనుకున్నట్లుగానే మేయర్ పీఠం మహిళలకు కేటాయించారు. జీహెచ్‌ఎంసీకి డిసెంబర్‌ ఒకటిన జరుగనున్న ఎన్నికల్లో మేయర్‌ పదవిని ఈసారి మహిళకు కేటాయించారు. అలాగే జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి రిజర్వేషన్‌ వివరాలను వెల్లడించారు.

ఎస్టీలకు రెండు, ఎస్సీలకు పది, బీసీలకు 25 సీట్లు రిజర్వ్‌ చేశారు. జనరల్‌ క్యాటగిరీలో 88 స్థానాలున్నాయి. అన్ని క్యాటగిరీల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్‌ పత్రాలు పొందవచ్చని పార్థసారథి తెలిపారు.

టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో నామినేషన్‌ పత్రం, ఇతర పత్రాలను ప్రింట్‌ తీసుకొని, వాటిని పూర్తిచేసిన తరువాత సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి పోటీచేసే అభ్యర్థి లేదా వారిని ప్రతిపాదించిన వ్యక్తి గానీ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500 జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులు రూ.5,000 నామినేషన్‌ ఫీజును డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..