కరోనాను జయించే శక్తి మహిళలకే ఎక్కువ!

|

Aug 28, 2020 | 5:23 PM

పురుషులతో పోలిస్తే కరోనా వైరస్‌ను జయించగల శక్తి మహిళలకే ఎక్కువగా ఉంటుందన్నది తాజా పరిశోధనల్లో రుజువయ్యింది! వైరస్‌ను తట్టుకోగల సామర్థ్యం నారిమణుల్లోనే అధికమట!

కరోనాను జయించే శక్తి మహిళలకే ఎక్కువ!
Follow us on

పురుషులతో పోలిస్తే కరోనా వైరస్‌ను జయించగల శక్తి మహిళలకే ఎక్కువగా ఉంటుందన్నది తాజా పరిశోధనల్లో రుజువయ్యింది! వైరస్‌ను తట్టుకోగల సామర్థ్యం నారిమణుల్లోనే అధికమట! మహిళల్లో రోగనిరోధకశక్తి ఎక్కువ ఉండటంతో కరోనా నుంచి చాలా ఈజీగా కోలుకుంటున్నారట! ఈ విషయాన్ని అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీకి చెందిన నేచర్‌ జర్నల్‌ చెబుతోంది.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే టీ సెల్స్‌ పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ ఉంటాయని పేర్కొంది. టీ సెల్స్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా క్రిమికారక వైరస్‌ను జయించవచ్చు.. ఈ విషయంలో మాత్రం పురుషులలో టీ సెల్స్‌ గొప్పగా పనిచేయడం లేదట.. ఇదేదో ఊహించి రాసిందేమీ కాదు.. 98 మంది కరోనా బాధితులను పరీక్షించి పరిశోధించి తెలుసుకున్న వాస్తవం.. అంతేనా రోగ నిరోధక శక్తికి బలం చేకూర్చే సైటోకైన్స్‌ వ్యవస్థ అంటే గ్లైకో ప్రోటిన్స్‌ లేదా ప్రోటీన్ల సమాహారం అన్నట్టు.. ఇది మహిళలలో చాలా గొప్పగా పని చేస్తున్నదని నివేదిక తెలిపింది..