అంతరిక్షంలో ‘డైనోసార్’ ! ఈ వీడియో చూడాల్సిందే !

| Edited By: Pardhasaradhi Peri

Jun 01, 2020 | 2:01 PM

భారీ రాకాసి బల్లి (డైనోసార్) అంతరిక్షం లోకి ఎలా వెళ్లిందబ్బా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది కనీవినీ ఎరుగని వింత అని ముక్కున వేలేసుకుంటున్నారు..

అంతరిక్షంలో డైనోసార్ ! ఈ వీడియో చూడాల్సిందే !
Follow us on

భారీ రాకాసి బల్లి (డైనోసార్) అంతరిక్షం లోకి ఎలా వెళ్లిందబ్బా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది కనీవినీ ఎరుగని వింత అని ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ.. అసలు విషయం తెలిసి ఫక్కున నవ్వుతున్నారు. కారణం, ? అది పిల్లలు ఆడుకునే బొమ్మ డైనోసార్ ! నిన్న అమెరికా ఫ్లోరోడా లోని కేప్ కెనవరల్ నుంచి నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ఇద్దరు వ్యోమగాములను రోదసీలోకి పంపగా.. రాబర్ట్ , డో హార్లే అనే వీరిద్దరూ 19 గంటల అనంతరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ రెండు దశల ఫాల్కన్-9 రాకెట్ ఎంచక్కా కక్ష్యలోకి ప్రవేశించింది కూడా. అయితే ఈ బొమ్మ డైనోసార్…. క్యాప్స్యూల్ లో గాల్లో తేలుతున్న దృశ్యం తాలూకు వీడియో వైరల్ అయి అప్పుడే పది లక్షల వ్యూస్ సాధించింది. మనుషులు, డైనోసార్ కూడా రోదసీలోకి వెళ్లారంటూ ట్విటర్ యూజర్ బ్రయాన్ అనే ఆయన సరదాగా ట్వీట్ చేసి.. ఈ క్లిప్ ని షేర్ చేశారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ టాయ్ డైనోసార్ ‘జీరో జీ-ఇండికేటర్’ లా పని చేస్తుందట. ఇలాంటి బొమ్మలను వ్యోమగాములు తరచూ తమ వెంట తీసుకువెళ్తుంటారు. అవి అంతరిక్షంలో గాల్లో తేలియాడుతుంటే.. క్రూ సిబ్బంది జీరో గ్రావిటీలోకి చేరినట్టేనట.

వ్యోమగాములు రాబర్ట్, హార్లెలకు ఇద్దరికీ కొడుకులున్నారు. వారికి డైనోసార్ బొమ్మలంటే చాలా ఇష్టమని , వాటితో ఆడుకొంటూఉంటారని తెలిసింది. తమ తండ్రులు స్పేస్ లోకి వెళ్తున్నారని తెలిసి వాళ్ళు ఈ బొమ్మల్లో ఒకదానిని ముఖ్యంగా రాబర్ట్ కొడుకు ఇఛ్చాడట. ‘భలే ! ఇప్పుడు నా కుమారుడు తనిచ్చిన ఈ టాయ్ స్పేస్ లో గాల్లో తేలుతుండడం చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు’ అని రాబర్ట్ అన్నాడు. స్పేస్ ఎక్స్ ఈ బొమ్మను కొద్దిసేపు ఆన్ లైన్ స్టోర్ లో ఉంచి ఆ తరువాత తొలగించింది. బహుశా దీన్ని  అమ్మకానికి పెట్టారేమో అన్న వార్తలు  గుప్పుమన్నాయి. ఈ బొమ్మను ఎలన్ మాస్క్.. సూపర్ హైటెక్ జీరో జీ-ఇండికేటర్ అని అభివర్ణించారు.