బ్రిటిష్ పీఎం భారత పర్యటనను ఆపాలని ఆ దేశ ఎంపీలను కోరతాం, రైతు సంఘాల నేతలు, ఆందోళనను ఉధృతం చేస్తాం

| Edited By: Pardhasaradhi Peri

Dec 22, 2020 | 7:19 PM

తమ ఆందోళనను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25, 26 తేదీల్లో భారత ఎంబసీల ఎదుట ప్రదర్శనలు నిర్వహిస్తామని రైతు నాయకుడు..

బ్రిటిష్ పీఎం భారత పర్యటనను ఆపాలని ఆ దేశ ఎంపీలను కోరతాం, రైతు సంఘాల నేతలు, ఆందోళనను ఉధృతం చేస్తాం
Follow us on

తమ ఆందోళనను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25, 26 తేదీల్లో భారత ఎంబసీల ఎదుట ప్రదర్శనలు నిర్వహిస్తామని రైతు నాయకుడు కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ఈ విధమైన నిరసన నిన్న అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో జరిగిందన్నారు. మా డిమాండ్లు తీరేవరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాను విజిట్ చేయకుండా ఆపాలని ఆ దేశ ఎంపీలను కోరుతామని అయన చెప్పారు. జనవరి 26 న భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా జాన్సన్ రానున్న సంగతి విదితమే. ఇండియా పంపిన ఈ ఆహ్వానాన్ని బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇలా ఉండగా రైతు సంఘాలన్నీ కేంద్రంతో మళ్ళీ చర్చలకు రాగలవన్న విశ్వాసాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యక్తం చేశారు. యూపీ కి చెందిన కొన్ని రైతు సంఘాలు తనను కలిసి..రైతు చట్టాలకు మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చాయన్నారు. అలాగే వాటికి సవరణలు అవసరం లేదని వారు కోరారని ఆయన చెప్పారు. కానీ పలు రైతు సంఘాలు దీన్ని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.