రైతు బిల్లుల ఆమోదం, సరికొత్త మలుపునకు శీకారం, మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2020 | 4:54 PM

రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. దేశంలో వ్యవసాయ రంగ చరిత్రను కొత్త మలుపు తిప్పిన 'ఉద్యమం'తో దీన్ని పోల్చారు. ఇది భారత వ్యవసాయ రంగంలో ఓ 'వాటర్ షెడ్ మూవ్ మెంట్'..

రైతు బిల్లుల ఆమోదం, సరికొత్త మలుపునకు శీకారం, మోదీ
Follow us on

రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. దేశంలో వ్యవసాయ రంగ చరిత్రను కొత్త మలుపు తిప్పిన ‘ఉద్యమం’తో దీన్ని పోల్చారు. ఇది భారత వ్యవసాయ రంగంలో ఓ ‘వాటర్ షెడ్ మూవ్ మెంట్’ అన్నారు. దేశంలోని రైతులను అభినందిస్తున్నానని, దశాబ్దాల తరబడి వివిధ ఆంక్షలు, మధ్య దళారుల వేధింపుల కారణంగా నష్టపోయిన అన్నదాతలకు  ఈ బిల్లుల ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఆ కష్టాల నుంచి పార్లమెంట్ వారిని దూరం చేసిందన్నారు. ఈ బిల్లుల వల్ల వారి ఆదాయం  రెట్టింపు అవుతుందన్నారు.

కాగా.. రాజ్యసభలో ఈ బిల్లులపై విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.   తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఏకంగా డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకే వెళ్లి బిల్లు తాలూకు రూల్ బుక్ ని చింపి వేశారు.