గాలి పటంతో ఎగిరిపోయిన చిన్నారి, ఎక్కడంటే ?

| Edited By: Anil kumar poka

Aug 31, 2020 | 2:30 PM

అక్కడ గాలిపటాల ఉత్సవం జోరుగా పిల్లలు, పెద్దల కేరింతల మధ్య  సాగుతోంది.  కైట్ ఫెస్టివల్ అంటే అందరికీ సరదాయే ! రంగురంగుల గాలిపటాలను ఉత్సాహంగా ఎగరవేస్తుంటే ఆ మజాయే వేరు ! అయితే...

గాలి పటంతో ఎగిరిపోయిన చిన్నారి,  ఎక్కడంటే ?
Follow us on

అక్కడ గాలిపటాల ఉత్సవం జోరుగా పిల్లలు, పెద్దల కేరింతల మధ్య  సాగుతోంది.  కైట్ ఫెస్టివల్ అంటే అందరికీ సరదాయే ! రంగురంగుల గాలిపటాలను ఉత్సాహంగా ఎగరవేస్తుంటే ఆ మజాయే వేరు ! అయితే  అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే మాత్రం అదంతా చప్పున చల్లారిపోతుంది. తైవాన్ లో ఇలా జరిగిన ఓ ఘటన చూస్తే ఒళ్ళు జలదరించక మానదు. అక్కడ ఎవరూ ఊహించని సంఘటన ఇది.. అతి పెద్ద గాలిపటం తోక భాగానికి చిక్కుకుపోయిన 3 ఏళ్ళ చిన్నారి ఆ కైట్ తో సహా గాల్లోకి..భూమికి సుమారు 100 అడుగుల ఎత్తున ఎగిరిపోయింది. ఆ కైట్ భాగం ఆమె నడుముకు చుట్టుకుపోవడం, అప్పుడే ఒక్కసారిగా వీచిన పెనుగాలికి ఆ గాలిపటంతో సహా ఆ పాప ఎగిరిపోవడం చూసి కింద ఉన్నవారంతా భయంతో కేకలు పెట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆ పాపకు చిన్నపాటి గాయాలు అయ్యాయని , గాలి తగ్గి కైట్ కిందకు దిగిపోగానే ఆ పాపను వెంటనే రక్షించామని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి ఈ ఫెస్టివల్ ని రద్దు చేశారు. పాపని గాలిపటం ‘ఎత్తుకుపోయిన’ వీడియోను లక్షలాది మంది చూసి ఆశ్చర్యంతో అవాక్కయ్యారు.