Former Minister Uma Bharti: గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు వద్దని నాడే సూచించా, బీజేపీ నేత ఉమా భారతి

| Edited By: Pardhasaradhi Peri

Feb 08, 2021 | 11:10 AM

ఉత్తరాఖండ్ లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించరాదని, ఇవి పర్యావరణపరంగా తీవ్ర హాని చేస్తాయని  బీజేపీ నేత  ఉమా భారతి అన్నారు..

Former Minister Uma Bharti: గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు వద్దని నాడే సూచించా, బీజేపీ నేత ఉమా భారతి
Follow us on

ఉత్తరాఖండ్ లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించరాదని, ఇవి పర్యావరణపరంగా తీవ్ర హాని చేస్తాయని  బీజేపీ నేత  ఉమా భారతి అన్నారు. ఈ రాష్ట్రంలోని ధౌలీ గంగా తదితర ఉపనదులు వరదలకు గురై ఉప్పొంగి ప్రవహించినప్పుడల్లా సమీప ప్రాంతాల్లోని విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బ తింటుంటాయని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ తొలి ప్రభుత్వ హయాంలో ఈమె మంత్రిగా జలవనరులు, గంగా నదీ ప్రక్షాళన, తదితర శాఖలను పర్యవేక్షించారు. హిమాలయ పర్వత ప్రాంతాలు అతి సున్నితమైనవని, తరచూ అక్కడ కొండచరియలు విరిగిపడడం సర్వ సాధారణమని ఉమా భారతి అన్నారు.  రిషిగంగా ప్రాంతంలో సంభవించిన ఘటన చాలా ఆందోళనకరమైనదని,  ఇది మనకు హెచ్ఛరిక కూడా అని ఆమె ట్వీట్ చేశారు. తాను శనివారం ఉత్తర కాశీలో ఉన్నానని, నిన్న హరిద్వార్ చేరుకున్నానని ఆమె వెల్లడించారు. హరిద్వార్ లో అధికారులు హై అలెర్ట్ జారీ చేయడం తనకు తెలుసునని ఆమె చెప్పారు.

తను కేంద్రంలో ఒకప్పుడు మంత్రిగా ఉండగానే ఉత్తరాఖండ్, ఆ సమీప రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం తగదంటూ ఓ అఫిడవిట్ ను రూపొందించినట్టు ఉమాభారతి తెలిపారు. అప్పుడే ఆయా రాష్ట్రాలకు తగిన సూచనలు చేశామన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని ఆమె వ్యాఖ్యానించారు.

 

Also Read:

Uttarakhand Glacier Outburst: ‘ఉత్తర’ ప్రళయం, మూడు వేల కోట్లు నీళ్ల పాలు ! వరదల్లో తుడిచిపెట్టుకుపోయిన తపోవన్ డ్యామ్

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో విరిగిపడ్డ కొండ చరియలు.. గ్రామం జలసమాధి