భూమిపై ఏ జీవరాశి లేని ప్రాంతం.. చూస్తే షాకే

| Edited By: Ravi Kiran

Nov 27, 2019 | 7:21 PM

ఈ సువిశాల భూమిలో ప్రతి భాగంలోనూ ఏదో ఓ జీవరాశి మనుగడ సాగిస్తూ ఉంటుందని ఇప్పటివరకు సైంటిస్టులు, సాధారణ మనుషులు నమ్ముతూ వస్తున్నారు..అయితే, మనం ఉంటున్న ఈ భూమిలోనే వేరే గ్రహాన్ని పోలి ఉండే వాతావరణం ఒక చోట ఉన్నట్టు, అక్కడ ఏ జీవి మనుగడ లేనట్టు రీసెంట్ గా తెలిసింది. నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ ప్రకారం, ఇథియోపియాలోని డల్లోల్ అనే ప్రాంతంలో ఈ నో లైఫ్ ల్యాండ్ ఉంది..ఇక్కడ నీరు […]

భూమిపై ఏ జీవరాశి లేని ప్రాంతం.. చూస్తే షాకే
Follow us on

ఈ సువిశాల భూమిలో ప్రతి భాగంలోనూ ఏదో ఓ జీవరాశి మనుగడ సాగిస్తూ ఉంటుందని ఇప్పటివరకు సైంటిస్టులు, సాధారణ మనుషులు నమ్ముతూ వస్తున్నారు..అయితే, మనం ఉంటున్న ఈ భూమిలోనే వేరే గ్రహాన్ని పోలి ఉండే వాతావరణం ఒక చోట ఉన్నట్టు, అక్కడ ఏ జీవి మనుగడ లేనట్టు రీసెంట్ గా తెలిసింది.

నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ ప్రకారం, ఇథియోపియాలోని డల్లోల్ అనే ప్రాంతంలో ఈ నో లైఫ్ ల్యాండ్ ఉంది..ఇక్కడ నీరు కావలసినంత ఉన్నప్పటికీ అందులో ఏ విధమైన సూక్ష్మజీవులు లేకపోవడం విశేషం. నిరంతరం భయంకరమైన వాయువులు వీయడమే కాదు.. చలికాలంలోనూ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతుంది. దీంతో సాధారణ మనుషులు జీవించేందుకు ఇది అస్సలు అనువైన ప్రాంతం కాదంటూ వారు తెలిపారు..

ఈ ప్రాంతంలోని నీటిలో ఆల్కలైన్, యాసిడ్ శాతాలు అత్యంత భయంకరమైన స్థాయిల్లో ఉంటాయి. అచ్చం మార్స్ ని పోలి ఉండే పరిస్థితుల్ని ఇక్కడ మనం చూడవచ్చంటూ సైంటిస్టులు చెబుతున్నారు .నలుపు పసుపు రంగుల్లో మెరిసిపోతున్న ఇక్కడి చెరువుల్లో మెగ్నీషియం పుష్కలంగా లభించడంతో పాటు, విపరీతమైన ఉప్పు స్థాయులు కలిగి ఉంటాయని.. అందుకే, ఎలాంటి సూక్ష్మ జీవులు ఇందులో పుట్టవని, పుట్టినా మనుగడ సాగించలేవంటూ చెబుతున్నారు.

అయితే, ఇప్పటివరకూ ఎక్కడ నీరుంటే అక్కడ జీవుల పుట్టుకకు, మనుగడకు అవకాశం ఉండి తీరుతుంది అంటూ నమ్ముతూ వచ్చిన సైంటిస్ట్‌లకి ఈ ప్రాంతం సరికొత్త సవాలును విసురుతోంది. నీరు ఉండగానే చాలదు, అది జీవులకు ఉపయోగపడేది అయితేనే లాభముంటుందని ఈ స్టడీస్ ద్వారా తేలిపోయింది.