Virus Attack On Poultry: వింత వైరస్ ఎఫెక్ట్: 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..

|

Feb 25, 2020 | 3:25 PM

తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో  వింత వైరస్ వల్ల సుమారు 30 వేల కోళ్లు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కోళ్లకు సంక్రమిస్తున్న వింత వైరస్‌పై తెలంగాణ పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన చేసింది...

Virus Attack On Poultry: వింత వైరస్ ఎఫెక్ట్: 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..
Follow us on

Virus Attack On Poultry: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో  వింత వైరస్ వల్ల సుమారు 30 వేల కోళ్లు చనిపోవడం సంచలనంగా మారింది. పౌల్ట్రీ ఫారం యజమానులు అందరూ ఆ వైరస్ ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.

Also Read: బాలికల హాస్టల్‌లో చొరబడ్డ యువకుడు.. అక్కడే రాత్రంతా…

అంతేకాకుండా సోమవారం మరో 5 వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీనితో కోళ్లఫాంల యజమానులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోళ్లకు సంక్రమిస్తున్న వింత వైరస్‌పై తెలంగాణ పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకూ ఎండలు పెరిగే సమయంలో విరులెంట్ న్యూకాజిల్ డిసీజ్(VND) అనే వైరస్ కోళ్లకు సోకుతుందని అధికారులు చెబుతున్నారు. దాన్ని టీకాలతో ద్వారా నియంత్రించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, ఏపీలోని నూజివీడు ప్రాంతం నుంచి ఆ కోడిపిల్లలను పెనుబల్లికి తీసుకువచ్చారని.. అక్కడి నుంచి ఈ వైరస్ వ్యాపించిందని స్పష్టం చేశారు.

Also Read: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై ఆన్లైన్‌లో ఫారెన్ లిక్కర్..!