దేశంలో కోవిడ్ మరణాలు లేవన్న వియత్నాం, కానీ….

| Edited By: Anil kumar poka

Aug 09, 2020 | 4:02 PM

వియత్నాంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తమ దేశంలో అసలు కోవిడ్ మరణాలే లేవని ప్రభుత్వం 'సగర్వంగా' ప్రకటించుకుంది. కానీ గత జులై 31 న ' ఆ లెక్క తప్పింది'. కరోనా రోగుల్లో 10 మంది మృతి చెందారని వార్తలందాయి.

దేశంలో కోవిడ్ మరణాలు లేవన్న వియత్నాం, కానీ....
Follow us on

వియత్నాంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తమ దేశంలో అసలు కోవిడ్ మరణాలే లేవని ప్రభుత్వం ‘సగర్వంగా’ ప్రకటించుకుంది. కానీ గత జులై 31 న ‘ ఆ లెక్క తప్పింది’. కరోనా రోగుల్లో 10 మంది మృతి చెందారని వార్తలందాయి. ఏప్రిల్ 16 నుంచి కరోనా సామాజిక వ్యాప్తి లేనేలేదని ముఖ్యంగా దనాంగ్ సిటీ అధికారులు పేర్కొన్నప్పటికీ..జులై నెలలో మూడు ఆసుపత్రుల్లో వృద్జ రోగులు మృతి చెందారని తెలియడంతో అధికారులు మళ్ళీ ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ వైరస్ 12 రాష్ట్రాలకు వ్యాప్తి చెందిందని, 333 మందికి ఇన్ఫెక్షన్లు సోకాయని తెలుస్తోంది. గత ఏప్రిల్ నుంచి దేశంలో భౌతిక దూరం పాటింపు వంటి నిబంధనలను ఎత్తివేయడంతో.. దనాంగ్ నగరంలోని బీచ్ లు జనాలతో క్రిక్కిరిసిపోయాయి. కానీ తిరిగి కరోనా జాడ కనబడడంతో ప్రధాని సుజుయెన్ జువాన్ అధికారులపై మండిపడ్డారు.

పొరుగునున్న ఫిలిప్పీన్స్, ఇండోనేసియా దేశాల నుంచి తమ దేశంలోకి ఈ వైరస్ చొరబడకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.