వియన్నా ఉగ్రవాదికి ఐసిస్ తో సంబంధాలు ?

| Edited By: Pardhasaradhi Peri

Nov 03, 2020 | 6:35 PM

వియన్నాలో గన్ తో కాల్పులు జరిపి నలుగురి మృతికి కారకుడైన వ్యక్తిని 20 ఏళ్ళ కుజ్ టిమ్ ఫెజులైగా గుర్తించారు. ఇతడి కాల్పుల్లో 17 మంది గాయపడ్డారు. ఐసిస్ లో చేరేందుకు ఇతడు సిరియా వెళ్లేందుకు ప్లాన్ చేశాడని, అయితే గత ఏడాది ఏప్రిల్ లో ఇతనికి జైలు శిక్ష విధించారని తెలుస్తోంది. జువెనైల్ లా  కింద ఇతడిని గత డిసెంబరులో జైలు నుంచి విడుదల చేశారు. 90 మంది ఆస్ట్రియన్ ఇస్లామిక్ రాడికల్స్ లో కు […]

వియన్నా ఉగ్రవాదికి ఐసిస్ తో సంబంధాలు ?
Follow us on

వియన్నాలో గన్ తో కాల్పులు జరిపి నలుగురి మృతికి కారకుడైన వ్యక్తిని 20 ఏళ్ళ కుజ్ టిమ్ ఫెజులైగా గుర్తించారు. ఇతడి కాల్పుల్లో 17 మంది గాయపడ్డారు. ఐసిస్ లో చేరేందుకు ఇతడు సిరియా వెళ్లేందుకు ప్లాన్ చేశాడని, అయితే గత ఏడాది ఏప్రిల్ లో ఇతనికి జైలు శిక్ష విధించారని తెలుస్తోంది. జువెనైల్ లా  కింద ఇతడిని గత డిసెంబరులో జైలు నుంచి విడుదల చేశారు. 90 మంది ఆస్ట్రియన్ ఇస్లామిక్ రాడికల్స్ లో కు జ్ టిమ్ కూడా ఒకడని పోలీసులు తెలిపారు. వియన్నాలో ఈ కుర్ర ఉగ్రవాది విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతాడని తాము ఊహించలేదన్నారు. ఇతగాడు కాల్పులు జరుపుతున్న దృశ్యాన్ని ఇజ్రాయెలీ టీవీ ఫుటేజీ చూపింది.

Video Courtesy: Mail Online