ఎన్నికలు జరిగిన మర్నాడే సుమారు లక్ష కరోనా కేసులు!

|

Nov 05, 2020 | 3:19 PM

అగ్రరాజ్యం అమెరికాలో అందరూ ఓట్ల లెక్కింపుపైనే దృష్టి పెట్టినట్టున్నారు.. అధ్యక్ష పదవిని చేజిక్కించుకోబోయేది ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.. ఇదే సమయంలో అక్కడ నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసులు భయపెడుతున్నాయి.. కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఎన్నికలేమోగానీ అక్కడ గడచిన 24 గంటల్లో దాదాపు లక్ష కేసులు కొత్తగా నమోదయ్యాయి.. ఇదేం చిన్న విషయం కాదు.. నిన్న రాత్రివరకు అక్కడ 99,660 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. వెయ్యి మందికి […]

ఎన్నికలు జరిగిన మర్నాడే సుమారు లక్ష కరోనా కేసులు!
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో అందరూ ఓట్ల లెక్కింపుపైనే దృష్టి పెట్టినట్టున్నారు.. అధ్యక్ష పదవిని చేజిక్కించుకోబోయేది ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.. ఇదే సమయంలో అక్కడ నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసులు భయపెడుతున్నాయి.. కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఎన్నికలేమోగానీ అక్కడ గడచిన 24 గంటల్లో దాదాపు లక్ష కేసులు కొత్తగా నమోదయ్యాయి.. ఇదేం చిన్న విషయం కాదు.. నిన్న రాత్రివరకు అక్కడ 99,660 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. వెయ్యి మందికి పైగా కరోనాతో మరణించారు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన మర్నాడే ఈ కేసులు బయటపడటం గమనార్హం.. ప్రపంచంలో కరోనాతో ఎక్కువ ఎఫెక్ట్ అయిన దేశం అమెరికానే! అక్కడ ఇప్పటి వరకు 94 లక్షల మందికి వైరస్‌ సోకింది.. రెండులక్షలకు పైగా కరోనాతో కన్నుమూశారు.