భారత్-చైనా మధ్య కయ్యమా ? మధ్యవర్తిత్వం వహిస్తా.. పరిష్కరిస్తా.. ట్రంప్

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 6:36 PM

భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తనకు తెలిసిందని, వీటి పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆ దేశాల బోర్డర్ వివాదాలపై దృష్టి పెట్టి సమస్య సద్దు మణిగేలా చూస్తానని ఆయన ట్వీట్ చేశారు. లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవలి కాలంలో రెండు దేశాల సైనిక దళాల మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. ఈ విషయం తెలిసిన తాము మధ్యవర్తిత్వానికి సిధ్ధంగా ఉన్నామని, సమస్యను పరిష్కరించగలుగుతామని ఆయన […]

భారత్-చైనా మధ్య కయ్యమా ?  మధ్యవర్తిత్వం వహిస్తా.. పరిష్కరిస్తా.. ట్రంప్
Follow us on

భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తనకు తెలిసిందని, వీటి పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆ దేశాల బోర్డర్ వివాదాలపై దృష్టి పెట్టి సమస్య సద్దు మణిగేలా చూస్తానని ఆయన ట్వీట్ చేశారు. లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవలి కాలంలో రెండు దేశాల సైనిక దళాల మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. ఈ విషయం తెలిసిన తాము మధ్యవర్తిత్వానికి సిధ్ధంగా ఉన్నామని, సమస్యను పరిష్కరించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. గతంలో కాశ్మీర్ సమస్య నేపథ్యంలోనూ భారత, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు మీడియేటర్ పాత్ర పోషించేందుకు తను రెడీగా ఉన్నట్టు ట్రంప్ పదేపదే ప్రకటించారు. ఇప్పుడు భారత-చైనా వివాదాల మధ్య కూడా తలదూరుస్తానని అంటున్నారు. అటు-యుధ్ధ సన్నాహాలకు రెడీగా ఉండవలసిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తమ సైనిక దళాలకు పిలుపునిస్తే… ఆ దేశ విదేశాంగశాఖ  అధికార ప్రతినిధి జావో లిజియాన్ మాత్రం పాత పాటే పాడుతున్నారు. బోర్డర్ సంబంధ సమస్యల్లో తమ దేశ వైఖరి క్లియర్ గా ఉందని, ఉభయ దేశాల నాయకులూ పరస్పర అంగీకార యోగ్యమైన ఒప్పందానికి  గతంలోనే వచ్చారని అంటున్నారు.

మా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని, సెక్యూరిటీని పరిరక్షించుకోవడానికి కట్టుబడి ఉన్నాం.. ప్రస్తుతం ఇండో-చైనా సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా, అదుపులో ఉంది. అని జావో లిజియాన్ పేర్కొన్నారు. కానీ లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద మాత్రం సిచువేషన్ ఇందుకు విరుధ్ధంగా ఉంది.