అమెరికా ఎన్నికల్లో ‘జో’కి జై కొట్టిన న్యూ హాంప్ షైర్ ?

| Edited By: Pardhasaradhi Peri

Nov 03, 2020 | 7:22 PM

అమెరికా ఎన్నికల ఫలితాలు మెల్లగా విడుదలవుతున్నాయి. 95 మిలియన్ల మంది ఓటర్లు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం..న్యూ  హాంప్ షైర్ లోని డిక్స్ విలే నాచ్ లో జో బైడెన్ ట్రంప్ కన్నా చాలా ఆధిక్యతలో ఉన్నారట.   తొలి ఫలితాల ట్రెండ్  ఇలా ఉందని ఈ వార్తాసంస్థ పేర్కొంది. అమెరికా-కెనడా బోర్డర్ లో ఉన్న […]

అమెరికా ఎన్నికల్లో జోకి జై కొట్టిన న్యూ హాంప్ షైర్ ?
Follow us on

అమెరికా ఎన్నికల ఫలితాలు మెల్లగా విడుదలవుతున్నాయి. 95 మిలియన్ల మంది ఓటర్లు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం..న్యూ  హాంప్ షైర్ లోని డిక్స్ విలే నాచ్ లో జో బైడెన్ ట్రంప్ కన్నా చాలా ఆధిక్యతలో ఉన్నారట.   తొలి ఫలితాల ట్రెండ్  ఇలా ఉందని ఈ వార్తాసంస్థ పేర్కొంది. అమెరికా-కెనడా బోర్డర్ లో ఉన్న ఈ టౌన్ లో ఓటర్లు చాలామంది జో బైడెన్ వైపే మొగ్గు చూపారని వెల్లడించింది. 2008, 2012 ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు బరాక్ ఒబామాతో బాటు తన పట్ల విశ్వాసం చూపారని, ఇప్పుడు మళ్ళీ ఈ సారి కమలా హారిస్ తో సహా మీ విశ్వాసాన్ని కోరుతున్నానని జో బైడెన్ ట్వీట్ చేశారు. ( నాటి ఎన్నికల్లో ఈయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశారు).