డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడబోతున్న వేళ, భారత స్మృతులతో కూతురు ఇవాంకా ట్రంప్

| Edited By: Anil kumar poka

Dec 02, 2020 | 12:24 PM

వచ్ఛే జనవరిలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడనున్నారు. మరికొన్ని వారాల్లో ఆయన నిష్క్రమణ జరగనుండగా  ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ ఇండియాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడబోతున్న వేళ, భారత స్మృతులతో కూతురు ఇవాంకా ట్రంప్
Follow us on

వచ్ఛే జనవరిలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడనున్నారు. మరికొన్ని వారాల్లో ఆయన నిష్క్రమణ జరగనుండగా  ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ ఇండియాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2017 నవంబరులో ప్రధాని మోదీతో కలిసి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొన్న ఈవెంట్ ను గుర్తు చేస్తూ కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. గ్లోబల్ సెక్యూరిటీ, సుస్థిరత, ఆర్ధిక వికాసం..వీటి నేపథ్యంలో భారత-అమెరికా దేశాల మధ్య మైత్రి ఎంతగానో బలపడిందన్నారు. కోవిడ్ 19 పై పోరును ప్రపంచదేశాలు కొనసాగిస్తుండగా.. ఈ మూడు అంశాలూ ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత పరిపుష్టం చేశాయని ఆమె పేర్కొన్నారు. మోదీతో కలిసి తాను పాల్గొన్న ఫోటోలను షేర్ చేస్తూ..ఇండియా పట్ల తన అభిమానాన్ని ఆమె  చాటుకున్నారు. భారత ప్రజల ఆదరణను తాను మరువలేనన్నారు. ఉన్నత స్థాయి ప్రతినిధిబృందంతో ఆమె నాడు ఇండియాను విజిట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య గాఢమైన మైత్రి ఉంది. వివిధ వేదికలపై వారు ఒకరిపట్ల ఒకరికి గల అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు. అమెరికాలోని  హూస్టన్ లో   50 వేలమందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ర్యాలీలో ఇద్దరూ పాల్గొనగా,, ఇండియా,లో..అహమ్మదాబాద్ లో లక్షలాది ప్రజలతో ట్రంప్ కు మోదీ స్వాగతం పలికిన విషయం గమనార్హం.  నాటి ఈవెంట్ ను ట్రంప్ వివిధ  వేదికల్లో ప్రస్తావించారు కూడా..